రాష్ట్రీయం

భద్రాద్రిలో నవంబర్ 10నుంచి జాతీయ స్థాయి బాలోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, సెప్టెంబర్ 3: శ్రీ సీతారామచంద్రస్వామి కొలువైన భద్రాచలం పట్టణంలో కేజీ టూ పీజీ విద్యార్థులకు ఈ ఏడాది జాతీయ స్థాయి బాలోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నవంబర్ 10, 11, 12 తేదీల్లో బాలోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తాళ్ళూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్టు, అవార్డీ టీచర్స్ అసోసియేషన్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సారపాక ఐటిసి పిఎస్‌పిడి కర్మాగారం, భద్రాచలం ఐటిడిఎ, నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మూడురోజులు ఘనంగా బాలోత్సవం జరుగుతుందని నిర్వాహకులు తాళ్ళూరి పంచాక్షరయ్య, బెక్కంటి శ్రీనివాస్ తెలిపారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ఆర్డీవో శివనారాయణరెడ్డి, సర్పంచ్ శే్వత, సిఐ శ్రీనివాసులు, తదితరులు ఆదివారం కార్యక్రమ బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు నిర్వాహకులను అభినందించారు. బాలోత్సవంలో 40 అంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో కేజీ నుంచి పీజీ చదువుతున్న విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని ఆహ్వానాలు పంపుతున్నారు. దేశభక్తి బృంద నృత్యాలు, పేరిణి నృత్యం, భరత నాట్యం, కూచిపూడి నృత్యం, క్విజ్, జానపదం, వ్యాసరచన, గిరిజన సంప్రదాయ నృత్యం, తదితర అంశాల్లో పోటీలు ఉంటాయి. ఈ పోటీలకు సుమారు 50వేల మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉండటంతో అందుకు తగిన ఏర్పాట్లు చేపట్టారు.