రాష్ట్రీయం

బిరబిరా కృష్ణమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 3: హమ్మయ్య... ఎన్నాళ్ల కెన్నాళ్ల కెన్నాళ్లకూ... అన్నట్లుగా శ్రీశైలం డ్యాంకు కృష్ణవేణి తరలివస్తోంది. దీంతో ఏడారిని తలపిస్తున్న కృష్ణా బేసిన్‌కు జల కళ ఇప్పుడిప్పుడే వస్తోంది. జూరాల గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయడంతో తెలంగాణ పులకించింది. శ్రీశైలం మల్లన్న పాదాలను కడిగేందుకు 32 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉరుకురికి వస్తోంది. ఈ ఏడాది తొలిసారిగా ఇంత పెద్ద ప్రవాహం శ్రీశైలం డ్యాంకు చేరడం ఇదే ప్రథమం. జూరాల గేట్లు ఎత్తివేశారు. 23,840 క్యూసెక్కుల నీరును విడుదల చేశారు. వర్షాకాలం సీజన్ చివరి దశకు చేరుకున్న తరుణంలో మహారాష్ట్ర, కర్నాటకలో ఎగువ కృష్ణా బేసిన్‌లో భారీ వర్షాలు కురవడంతో అక్కడి ఉజ్జయిని, ఆల్మట్టి, నారాయణ్‌పూర్ ప్రాజెక్టులు జల సంపద కళ కళలాడుతోంది. అతి భారీ వర్షాలు గత వారం నుంచి నిరంతరం మహాబలేశ్వర్ ప్రాంతంలో కురవడంతో ఆల్మట్టి గేట్లను ఎత్తివేయని పరిస్ధితులు తలెత్తాయి. దీంతో మహారాష్టల్రో బీమా నదిపై నిర్మించిన ఉజ్జయిని ప్రాజెక్టు, కర్నాటకలో ఆల్మట్టి డ్యాంల నుంచి నీటిని విడుదల చేశారు. శ్రీశైలంలో పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం 792.3 అడుగులకు చేరింది. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 215.81టిఎంసిలు కాగా, ప్రస్తుతం 25.41కు చేరుకుంది. రెండు నెలలుగా 20టిఎంసిల నీటితో ఉన్న శ్రీశైలం డ్యాంలో ఐదు టిఎంసిల నీరు పెరిగింది. ఆల్మట్టిలో 129.72 టిఎంసిలకి 128.19 టిఎంసిల నీరు ఉంది. ఆల్మట్టి నుంచి 32370 క్యూసెక్కుల
నీటిని వదిలారు. నారాయణ్‌పూర్‌లో 37.65 టిఎంసిలకి 37.61 టిఎంసిల నీరు ఉంది. ఇక్కడి నుంచి 33,474 క్యూసెక్కుల నీటిని వచ్చింది వచ్చినట్లు దిగువకు వదలడంతో తెలంగాణ ప్రవేశంలో ఉన్న జూరాలకు నీరు చేరుతోంది. జూరాలలో 9.66 టిఎంసిలకి 7.46 టిఎంసిల నీటి నిల్వలు ఉన్నాయి. జూరాల నుంచి దాదాపు 24వేలకు పైగా క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
సాగునీటి నిపుణుల అంచనా ప్రకారం ఇదే రీతిలో భారీ వర్షాలు కొనసాగినట్లయితే, ఎగువన ఉన్న రాష్ట్రాలు నీటిని నిల్వ చేసుకోలేవు. నీటిని వదలాల్సిందే. దీని వల్ల జూరాల మీదుగా శ్రీశైలంకు నీటి ప్రవాహం పెరుగుతుంది. దురదృష్టమేమిటంటే, తెలంగాణలో, ఆంధ్రాలోని రాయలసీమలో, కర్నాటక తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతంలో ఆశించిన రీతిలో వర్షాలు కురవడం లేదు. ఇదే శ్రీశైలం డ్యాంకు శాపంగా మారింది. ప్రతి ఏడాది తుంగభద్ర ద్వారా 70 టిఎంసి వరకు నీరు వచ్చేది. ఈ సారి ప్రాజెక్టు నిండలేదు. తుంగభద్రలో 100.86 టిఎంసిలకి 70.57 టిఎంసిలు ఉన్నాయి. తుంగభద్ర పరవళ్లు తొక్కితేకాని శ్రీశైలంకు భారీ నీటి ప్రవాహం వచ్చే పరిస్థితి లేదు. నాగార్జునసాగర్ డ్యాంలో 312.05 టిఎంసిలకి కేవలం 115.31 టిఎంసిల నీటినిల్వ ఉంది. ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో స్వల్పమే.
శ్రీశైలంలో కనీసం 100 టిఎంసిల నీరు చేరితే తెలంగాణలో నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు, ఆంధ్రాలో జిల్లాలకు మంచినీటి కొరత తగ్గుతుంది. ఈ నీటిని దామాషా నిష్పత్తి ప్రకారం మంచినీటి అవసరాలకు ఉపయోగించుకోవచ్చని సాగునీటి రంగ నిపుణులంటున్నారు. ఈ ప్రవాహం వల్ల శ్రీశైలం డ్యాంకు ఈ డ్యాంను నమ్ముకుని ఉన్న రాయలసీమపోతిరెడ్డి పాడు రెగ్యులేటర్ నీటి మళ్లింపుకు పెద్దగా వచ్చే ప్రయోజనం లేదు. శ్రీశైలం డ్యాం నీటి మట్టం 854 అడుగులు చేరితే తప్ప పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీటిని మళ్లించే అవకాశం లేదు.