రాష్ట్రీయం

ఐటి మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ కెటిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 3: ఐటి శాఖ మంత్రి కె తారక రామారావుకు ఐటి మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ప్రకటించారు. ఈనెల తొమ్మిదిన ఢిల్లీలో జరిగే 49వ స్కోచ్ సమ్మిట్‌లో ప్రదానం చేస్తారు. ఐటి శాఖ మంత్రి కె తారకరామారావు పనితీరును గమనిస్తున్నానని, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఐటి రంగంలో ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లడానికి ఆయన చేస్తున్న కృషిని గమనిస్తున్నట్టు స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చర్ తెలిపారు. నవ భారతంలో నవ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయవచ్చునో చూపిస్తున్నారని అన్నారు. స్కోచ్ 2003 నుంచి రాష్ట్రాల పనితీరుపై స్వతంత్రంగా అంచనా వేస్తున్నట్టు, అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. స్మార్ట్ గవర్నెన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చే రాష్ట్రాలను గమనిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలో ఐటి శాఖ మంత్రిగా కెటిఆర్ అమలులోకి తీసుకు వచ్చిన నూతన ఐటి పాలసీలు, వినూత్న విధానాలను స్వతంత్రంగా అధ్యయనం చేసి అవార్డుకు ఎంపిక చేసినట్టు చెప్పారు. ఐటి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత కెటిఆర్ తెలంగాణలో ఐటి భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయాలు ఆధారంగా అవార్డుకు ఎంపిక జరిగినట్టు తెలిపారు. అత్యుత్తమ రాష్ట్రాల జాబితాలో 2015లో 18వ ర్యాంక్‌లో నిలిచిన తెలంగాణ, 2016లో మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు.