రాష్ట్రీయం

మంచి సంకేతం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 3:కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు చోటు లేక పోవడం మంచి సంకేతం కాదని ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రివర్గంపై నెట్ జన్‌లో ట్విట్టర్‌లో కెటిఆర్‌ను ప్రశ్నించగా, ఆయన సమాధానం చెప్పారు. కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ నుంచి ఏకైక ప్రతినిధి బండారు దత్తాత్రేయ ఉన్నారు. ఈ విస్తరణలో దత్తాత్రేయను తొలగించారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో తెలంగాణకు చోటు లేకపోవడంపై స్పందించాలని నెట్ జన్ ట్విట్ చేయగా, ఇది మంచి సంకేతం కాదని అన్నారు. సురేష్ ప్రభు రైల్వే మంత్రి కావడం వల్ల తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ వస్తుందని ఆశిస్తున్నారా? అని ప్రశ్నించగా, ఏ శాఖ మంత్రి ఎవరూ అనేది కాదు, కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ఏ శాఖ మంత్రిగా ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాల్సి ఉంటుందని అన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి హామీలకు కట్టుబడి ఉండాల్సి ఉంటుందని అన్నారు. రిటైర్డ్ బ్యూరోక్రాట్లకు మంత్రివర్గంలో అవకాశం కల్పించడంపై ప్రశ్నించినప్పుడు కెటిఆర్ దీనిని స్వాగతించారు. మంచి ట్రాక్ రికార్డు ఉండి, అనుభవం ఉన్న వారి సేవలు ఉపయోగించుకోవడం మంచి నిర్ణయమని అన్నారు. వారు పార్టీ లైన్ ప్రకారమే పని చేయాల్సి ఉంటుందని చెప్పారు.