రాష్ట్రీయం

టిఆర్‌ఎస్‌తో కలిసేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, సెప్టెంబర్ 3: తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికార టిఆర్‌ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిని, పోరాటాలను మజ్లిస్‌కు తాకట్టు పెడుతున్న కెసిఆర్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. నాడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా జరపాల్సిందేనని చెప్పిన కెసిఆర్ నేడు ఆ విషయాన్ని పట్టించుకోకపోగా రజాకార్లకు వారసులుగా ఉన్న మజ్లిస్ పార్టీ నేతలతో కలిసి తిరుగుతున్నారన్నారు. దేశమంతా ఆగస్టు 15న స్వాతంత్య్రమొస్తే ఆ తరువాత 13నెలల పాటు దొడ్డి కొమరయ్య, చాకలి అయిలమ్మ లాంటి నేతల పోరాటాల ఫలితంగా నిజాం నవాబు దిగివచ్చి దేశంలో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేశారన్నారు. ఆ 13 నెలలు ప్రజలను చిత్రహింసలకు గురిచేసిన నిజాం నవాబును కెసిఆర్ ప్రభుత్వ పెద్దలు పొగుడుతుండటం దురదృష్టకరమన్నారు. కాకతీయుల వారసులమని చెప్పుకోవాల్సిన నేతలు నిజాం వారసుల మాదిరిగా పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. టిఆర్‌ఎస్ నేతలు అధికారంలోకి వచ్చిన తరువాత అసలు లక్ష్యాలను విడనాడుతున్నారన్నారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా జరపాల్సిందేనని కోరుతూ రాష్టవ్య్రాప్తంగా యాత్ర చేపట్టినట్లు చెప్పారు.

చిత్రం..ఖమ్మంలో విలేఖరులతో మాట్లాడుతున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్