రాష్ట్రీయం

తేలిగ్గా తీసుకోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 4: ఒక ఎన్నికతో అనేక ప్రశ్నలకు దీటైన జవాబిచ్చారని ప్రజలను టిడిపి అధినేత, సిఎం చంద్రబాబు అభినందించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో సోమవారం తెదేపా నాయకత్వ శిబిరంలో అధ్యక్షోపన్యాసం చేశారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాల వల్ల ప్రజల్లో విశ్వాసం, పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగిందని చెప్పారు. జాతీయంగా, అంతర్జాతీయంగా ఈ ఉప ఎన్నికలు రాష్ట్ర ప్రతిష్ఠను ఇనుమడింప చేశాయన్నారు. తెదేపాను ఏదోలా ఓడించాలన్న ప్రతిపక్షం కుట్రలను ప్రజలు భగ్నం చేశారన్నారు. పార్టీ, ప్రభుత్వంపై ప్రతిపక్షం దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టారని నేతలు, శ్రేణులను ప్రశంసించారు. ‘రాబోయే ఎన్నికలు ఏకపక్షం కావాలి. నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాలే అందుకు నాంది. 2019 ఎన్నికల్లో అన్ని సీట్లు గెలవాలి, దానికి ప్రణాళికలు రూపొందించాలి’ అని సిఎం దిశా నిర్దేశం చేశారు. ‘మితిమీరిన ఆత్మవిశ్వాసం ప్రమాదం. నాయకుడికి ప్రతి ఎన్నిక ఒక పాఠం లాంటిది. ఫలితాలపై తప్పొప్పులు సమీక్షించుకోవాలి. భవిష్యత్ ప్రణాళిక రూపొందించాలి. రాబోయే ఎన్నికల్లో ఛాన్స్ తీసుకోవడానికి సిద్ధంగా లేను. గెలుపు సాధించడమే మన లక్ష్యం. ఎన్నిక అనేది ఒక ప్రక్రియ మాత్రమే. ప్రతి ఎన్నిక నల్లేరు మీద నడక కావాలి’ అని సిఎం చంద్రబాబు సూచించారు. పబ్లిక్ మేనేజ్‌మెంట్, పొలిటికల్ మేనేజ్‌మెంట్, పోల్ మేనేజ్‌మెంట్‌లో తెలుగుదేశం పార్టీదే ఎప్పుడూ పైచేయి కావాలని ఆకాంక్షించారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో అనుసరించిన పోల్ స్ట్రాటజీ, ప్రచారశైలి, ఎలక్షన్ ఇంజినీరింగ్, బూత్ మేనేజ్‌మెంట్ వివరాలతో రూపొందిం చిన ఎల్లోబుక్ భవిష్యత్ ఎన్నికలకు దిక్సూచి కావాలన్నారు. సెప్టెంబర్ 6, 7, 8 తేదీల్లో రాష్టవ్య్రాప్తంగా జరిగే ‘జలసిరికి హారతి’ కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. మూడు నెలల్లో 28 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేస్తున్నాం. ఈ ఏడాది కూడా రెండంకెల వృద్ధిరేటు సాధిస్తాం. వరుసగా మూడేళ్లు రెండంకెల వృద్ధి సాధించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిపోతుంది. మిగులు విద్యుత్ సాధించాం. పారిశ్రామికీకరణ చేస్తున్నాం. వ్యవసాయంలో మొదటి క్వార్టర్‌లో 27 శాతం వృద్ధి సాధించాం. వీటన్నింటి గురించి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. మన రాష్ట్రం దేశానికే ఒక మోడల్ స్టేట్ కావాలి అని చంద్రబాబు అన్నారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కళా వెంకట్రావు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, పెద్ది రామారావు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

చిత్రం..టిడిపి నాయకత్వ శిక్షణా శిబిరంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు