రాష్ట్రీయం

మండలి చైర్మన్ ఫరూఖ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 4: శాసనమండలి చైర్మన్‌గా మాజీ మంత్రి ఎన్‌ఎండి ఫరూఖ్‌ను నియమిస్తున్నట్లు సిఎం చంద్రబాబు ప్రకటించారు. సోమవారం మంగళగిరి హ్యాపీ రిసార్ట్స్‌లో సెంటర్ ఫర్ లీడర్‌షిప్ ఎక్స్‌లెన్స్ పేరిట జరుగుతున్న పార్టీ నేతల సమావేశంలో ఫరూఖ్ పేరును చంద్రబాబు ఖరారు చేశారు. దీనికి పార్టీ నేతలు పెద్దపెట్టున హర్షధ్వానాలతో స్పందన తెలియచేశారు. నంద్యాల, కాకినాడ ఎన్నికలపై పార్టీ నాయకత్వం సోమవారం విశే్లషించింది. ఈ సందర్భంగా ఆ రెండు ఎన్నికల్లో పనిచేసిన నాయకులను ఆహ్వానించి, పేరుపేరునా చంద్రబాబు అభినందించారు. తొలుత కేక్ కట్‌చేసి అందరికీ తినిపించారు. గెలుపు ఓటములు ఎప్పుడూ ప్రభావితం చూపిస్తూనే ఉంటాయి. మనం టెక్నాలజీని అనుకూలంగా వాడుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయనడానికి ఈ రెండు ఎన్నికలే నిదర్శనం. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రచారం చేస్తే ప్రతిపక్షానికి చెప్పుకోవడానికి
ఏమీ ఉండవు. త్వరలో ఇక్కడికి దగ్గర్లోనే పార్టీ కార్యాలయం నిర్మిస్తామని చంద్రబాబు చెప్పారు.
కాగా ఈ సందర్భంగా రెండు ఎన్నికల్లో విజయంపై మంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సమష్టి కృషి, సమర్థ నాయకత్వంతో జగన్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చినందుకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లోనూ ఇదే ఊపు, ఉత్సాహం కొనసాగించి పార్టీని అధికారంలోకి తీసుకు వద్దామని పిలుపునిచ్చారు.

చిత్రం..ఫరూఖ్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందిస్తున్న సీఎం చంద్రబాబు