రాష్ట్రీయం

పురుషోత్తపట్నం పాక్షికం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 4: ఏలేరు రిజర్వాయర్ పరిధిలోని ఆయకట్టు ప్రస్తుత ఖరీఫ్‌కు సాగునీరు అందించేందుకు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పాక్షికంగా సిద్ధమైంది. రోజుకు 700 క్యూసెక్కుల సాగునీరు అందించేందుకు పథకాన్ని సిద్ధం చేశారు. మొత్తం 98వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు లభించనుంది. అంటే, ఏలేరు ఆయకట్టుకు ఈ ఖరీఫ్ నుంచే స్థిరీకరణ లభించినట్టయింది. రాష్ట్ర జల వనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మంగళవారం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం స్టేజ్-1 పంపుహౌస్ వద్ద పూజచేసి రెండు పంపులను ఆన్ చేయడంతో సాగునీటి సరఫరా మొదలవుతుంది.
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పంపుహౌస్ నుంచి నేలకోట వద్ద నిర్మించిన డిశ్చార్జి పాయింట్ వరకు 10.10 కిలోమీటర్ల మేర పైపులైన్ పూర్తయింది. పూర్తయిన పైపులైన్ నుంచి రెండు పంపుల ద్వారా ఎత్తిపోసిన జలాలు ముందుగా పోలవరం కాల్వకు చేరుకుంటున్నాయి. పోలవరం ఎడమ ప్రధాన కాలువ 1.6 కిలోమీటర్ల వద్ద రెగ్యులేటర్ పాయింట్ నుంచి పురుషోత్తపట్నం ఎత్తిపోతల జలాలు పుష్కర కాల్వలోకి చేరుకుంటాయి. పోలవరం ఎడమ ప్రధాన కాల్వ అలైన్‌మెంట్‌లో మూడుచోట్ల హైవే క్రాసింగ్ పనులు జరుగుతున్న క్రమంలో పుష్కర కాలువ ద్వారానే జలాలను ఏలేరుకు మళ్లిస్తున్నారు. 57వ కిలోమీటరు వద్దనున్న రెగ్యులేటర్ నుంచి ఒకవైపు ఏలేరుకు, మరోవైపు పుష్కర కాల్వకు నీటిని మళ్లించే ఏర్పాట్లు చేశారు.
మొదటి దశలో 3500 క్యూసెక్కులను నిలువు టర్బైన్ పంపుల ద్వారా పంపిణీ చేయాల్సివుంది. మొత్తం 10 పంపుల ద్వారా నీటిని తోడాల్సి వుండగా ప్రస్తుతానికి రెండు పంపులు సిద్ధమయ్యాయి. ఒక్కొక్క పంపు 350 క్యూసెక్కులు తోడుతోంది. ఈ పథకంలో 3.2 మీటర్ల వ్యాసం కలిగిన ఐదు వరుసల స్టీలు పైపుల నిర్మాణం జరుగుతోంది. ఒక్కొక్క పైపులైన్ పొడవు 10.10 కిలోమీటర్లు. ఒక పైపులైన్ పూర్తిచేసి నీటి సరఫరా మొదలుపెట్టారు. ఇందులో ఒక్కొక్క పంపు సామర్ధ్యం 4.77 మెగావాట్లలో ఏర్పాటు చేశారు. 5.22 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన మోటార్లను ఏర్పాటుచేశారు. 220/11 కెవి సబ్-స్టేషన్ నిర్మాణం జరుగుతోంది. ఈలోగా పక్కనేవున్న పుష్కర పంపుహౌస్‌లో ఉన్న రెండు 10 కెవి కనెక్షన్లలో ఒక 10 కెవి కనెక్షన్‌ను పురుషోత్తపట్నం పథకానికి మళ్ళించి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. పురుషోత్తపట్నం సబ్-స్టేషన్ పనులు జరుగుతున్నాయి. ఈ పథకానికి 522.2 మెగావాట్ల విద్యుచ్ఛక్తి అవసరం.
రెండో దశలో 1400 క్యూసెక్కుల నీటిని తోడతారు. ఎనిమిది పంపులను వినియోగిస్తారు. ఒక్కో పంపు 175 క్యూసెక్కుల నీటిని తోడుతుంది. ఇక్కడ నుంచి ఏలేరు నది వరకు 3.2 మీటర్ల వ్యాసం కలిగిన 2 వరసల స్టీలు పైపులు నిర్మిస్తున్నారు. ఇక్కడ నుంచి ఒక్కొక్క పైపులైన్‌ను 13.12 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు. 3.80 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన పంపులకు 4.70 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన మోటార్లను బిగిస్తున్నారు. ఈ పంపుహౌస్‌లో 37.60 మెగావాట్ల విద్యుచ్ఛక్తి అవసరమవుతుంది. హెడ్‌వర్క్సులో 82 డయాఫ్రమ్ గోడలను పూర్తిచేశారు. సూపర్ స్ట్రక్చర్ కాంక్రీటు ఎనిమిది పంపులకు సంబంధించి పూర్తయింది. అప్రోచ్ ఛానల్ మట్టిపని పూర్తయింది. రెండో పంపుహౌస్‌కు సంబంధించి రెండు పంపులు, ఒక పైపులైన్ పూర్తయింది. మొత్తానికి గోదావరి జలాలు ఏలేరుకు అనుసంధానం పూర్తయింది. డిసెంబర్ నాటికి పనులు మొత్తం పూర్తిచేసి నిర్ధేశిత సామర్ధ్యం మేరకు నీటిని పంపిణీ చేయడానికి ప్రణాళిక రూపొందించారు.

చిత్రం..పురుషోత్తపట్నం వద్ద స్టేజ్-1 పంపుహౌస్