రాష్ట్రీయం

భద్రత కట్టుదిట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 4: గణేశ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని, నిమజ్జనానికి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 94,846 వినాయక విగ్రహాల ప్రతిష్ఠ జరిగిందన్నారు. సోమవారం డిజిపి అనురాగ్ శర్మ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్ పరిధిలో 11,572, సైబరాబాద్ పరిధిలో 7,878, రాచకొండ పరిధిలో 7,381 గణనాథులను ఏర్పాటు చేశారని డిజిపి తెలిపారు. మంగళవారం జరిగే గణేశ నిమజ్జనానికి హైదరాబాద్‌లో 27వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశామని, వీరిలో 11మంది ఐజీలు, నలుగురు డిఐజిలు, 15మంది ఎస్పీలు, 7గురు అదనపు ఎస్పీలు, 132మంది డిఎస్పీలు, 349 సిఐలు, 1209మంది ఎస్‌ఐలు, 11642 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, అదేవిధంగా ఆర్మ్‌డ్/ టిఎస్‌ఎస్‌పి- 87ప్లాటూన్ల సిబ్బందిని బందోబస్తుకు వినియోగిస్తున్నట్టు అనురాగ్‌శర్మ వివరించారు. గణేశ నిమజ్జనోత్సవాన్ని ఏరియల్ సర్వే ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని, అత్యాధునిక సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. హుస్సేన్ సాగర్ వద్ద 5 కి.మీ.ల దూరంలోని దృశ్యాలను సైతం కెమెరాల్లోబంధించేందుకు వీలుగా పీటీజడ్ కెమెరాలు వినియోగిస్తున్నట్టు అనురాగ్‌శర్మ వెల్లడించారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న డిజిపి అనురాగ్ శర్మ