రాష్ట్రీయం

పించనుకు సర్వే ఎసరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 4: రాష్ట్రంలో భూముల రికార్డులు అయోమయంగా, గందరగోళంగా మారడంతో రాష్టవ్య్రాప్తంగా సమగ్ర భూ సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. స్వాతంత్రానికి పూర్వం ఎప్పుడో నిజాం హయాంలో భూముల సర్వే జరగడంతో భూ వివరాలు రెవిన్యూ రికార్డుల్లో ఒకలాగా, వ్యవసాయ రికార్డులలో మరొకలాగా ఉండటంతో వీటిని అప్‌డేట్ చేసి రికార్డులను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్న వ్యవసాయానికి ఉచిత పెట్టుబడి అర్హులకు మాత్రమే అందించడానికి భూ రికార్డుల ప్రక్షాళన మరో ప్రధాన కారణం. అయితే భూ సర్వేతో కొన్ని సంక్షేమ పథకాలు ముడిపడి ఉండటంతో ప్రస్తుతం అందుతున్న లబ్థి అందకుండా పోతుందేమోనన్న భయాందోళనలు గ్రామీణ ప్రాంతాల్లో నెలకొంది. దీంతో గ్రామస్తుల సహకారం, అందరి ఆమోదంతోనే సర్వే తుది జాబితాను వెల్లడిస్తామని ప్రభుత్వం ప్రకటించటంతో ప్రజల్లో నెలకొన్న భయాందోళనల వల్ల సర్వేకు ఎంత వరకు సహకరిస్తారన్న సందేహాలు క్షేత్రస్థాయిలో రెవిన్యూ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టిఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ‘ఆసరా’ ఫించన్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఫించన్లు పొందడానికి అర్హతలలో వ్యవసాయ భూమి ప్రధానమైంది. మూడు ఎకరాల తరి (మెట్ట) కానీ, ఏడున్నర ఎకరాల ఖుష్కి (చెలక) సాగునీటి సదుపాయం కలిగి ఉంటే ఆసరా ఫించన్లు పొందడానికి అర్హులు కారని మార్గదర్శకాలు ఉన్నాయి. ఫించన్లు పొందుతున్న లబ్ధిదారులకు నిర్దేశించిన దానికంటే ఎక్కువ భూమి ఉన్నట్టు సమగ్ర సర్వేలో తేలినప్పటికీ, ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి ఫించన్లకు కోత పెట్టకుండా కొనసాగిస్తూ వచ్చింది. అయితే ఈసారి ప్రత్యేకంగా భూ సర్వేకు పూనుకోవడంతో ఫించన్లు పొందే అర్హత కోల్పోయి ప్రస్తుతం లభిస్తున్న ఫించన్లు రద్దవుతాయమోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వీరి ఆందోళనకు కారణం లేకపోలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో సామాజిక సర్వే నిర్వహించి ‘ఆసరా’ పెన్షన్లను భారీ ఎత్తున రద్దు చేసినట్టు క్షేత్రస్థాయి రెవిన్యూ అధికారులకు సమాచారం అందినట్టు తెలిసింది. భూ సర్వే నిర్వహించడం వల్ల తమకున్న భూమి వివరాలు బహిర్గతం అయితే ఫించన్లు రద్దు అవుతాయమోనన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్‌లో రద్దు చేసిన ఫించన్లకు, ఈనెల 15 నుంచి నిర్వహించబోయే భూ సర్వేకు సంబంధం లేదని జిల్లా అధికారులు స్పష్టం చేస్తున్నా ప్రజలకు నమ్మకం కలగడం లేదని ఎమ్మార్వో ఒకరు తెలిపారు. భూ సర్వే ప్రారంభం కాకముందే ప్రభుత్వం నుంచి ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన వెలువడితే తప్ప ప్రజలు సహకరించే అవకాశం లేదని క్షేత్రస్థాయి రెవిన్యూ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఎనిమిది రకాల ఫించన్లను అమలు చేస్తుంది. వృద్ధ్యాప ఫించన్లు, వితంతువు ఫించన్లు, దివ్యాంగుల ఫించన్లు, గీత, చేనేత, బీడి కార్మికుల ఫించన్లు, హెచ్‌ఐవి (ఎయిడ్స్ రోగుల) ఫించన్లు, ఒంటరి మహిళల ఫించన్లను ఇస్తుంది. వీటిలో వికలాంగులకు నెలనెలా రూ. 1500 ఫించన్ ఇచ్చి మిగతా వారికి రూ. 1000 చొప్పున చెల్లిస్తుంది. రాష్టవ్య్రాప్తంగా మొత్తంగా వివిధ రకాల ఫించన్లు పొందుతున్న వారి సంఖ్య 38,42,386 మంది కాగా ఇందులో వృద్ధ్యా ఫించన్లు 13,36,119, వికలాంగుల ఫించన్లు 4,72,266, వితంతువు ఫించన్లు 13,79,437, చేనేత కార్మికుల ఫించన్లు 35,273, గీతా కార్మికుల ఫించన్లు 59,372, బీడి కార్మికుల ఫించన్లు 4,01,410, ఒంటరి మహిళ ఫించన్లు 1,16,008 మందికి చెలిస్తుంది. దాదాపు 38.50 లక్షల మంది ఇంత పెద్ద మొత్తంలో లబ్ధిపొందే పథకం ఆసరా తప్ప మరేదీ లేదు. అలాంటి పథకానికి భూ సర్వేతో సంబంధం ఉందా? లేదా? అనేది ప్రభుత్వం స్పష్టం చేయకపోతే ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న భయాందోళనల వల్ల సర్వే సక్రమంగా మందుకు సాగే అవకాశం లేదని క్షేత్రస్థాయి రెవిన్యూ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.