రాష్ట్రీయం

రూ.5 కోట్లతో నిమజ్జన ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 4: జంట నగరాల్లో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సచివాలయంలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో తలసాని మాట్లాడారు. ఈ సంవత్సరం 10,200 మండపాలకు అనుమతి ఇవ్వగా, వీటిలో 4,101 విగ్రహాల నిమజ్జనం ఇప్పటికే జరిగిందని, మిగిలిన 6,100 విగ్రహాలను మంగళవారం నిమజ్జనం చేస్తారని చెప్పారు. హుస్సేన్ సాగర్, ఎన్‌టిఆర్ మార్గ్, రాజన్న బౌలి, మీరాలం ట్యాంక్, ఎర్ర కుంట, షేక్‌పేట ట్యాంక్, సరూర్ నగర్ ట్యాంక్, హస్మత్ పేటలలో గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.
గణేష్ నిమజ్జనం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సుమారు 25వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. 310 అత్యంత సున్నిత, మరో 605 సున్నిత ప్రాంతాలను పోలీసులు గుర్తించారని, 40 మొబైల్ పోలీసు బృందాలు నిమజ్జనం ప్రశాంతంగా జరిగే విధంగా కృషి చేస్తున్నారని తెలిపారు. గణపతి విగ్రహాల నిమజ్జనానికి ఎన్‌టిఆర్ మార్గ్‌లో 16, ట్యాంక్‌బండ్ వద్ద 25, మినిస్టర్ రోడ్డులో 3, రాజన్న బౌలి వద్ద మూడు, మీరాలం ట్యాంక్‌లో 2, ఎర్రకుంటలో రెండు క్రేన్‌లను సిద్ధంగా ఉంచినట్టు తెలిపారు.
అంబులెన్స్‌లు, జనరేటర్లు, వైద్య బృందాలు, మెకానికి బృందాలను కూడా ఏర్పాటు చేసినట్టు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నిమజ్జనం జరిగే మార్గాల్లో 117 పాయింట్లను గుర్తించి దాదాపు ఐదు కోట్ల వ్యయంతో తాత్కాలిక మరమ్మత్తు పనులు చేయించినట్టు చెప్పారు. ప్రతి సర్కిల్‌లో ఒక ఎమర్జన్సీ టీంను నిరంతరం అందుబాటులో ఉంచారు. ఆర్టీసి ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి 16 మార్గాల గుండా ట్యాంక్‌బండ్‌పైకి ఐదువందల ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు మంత్రి తెలిపారు.

చిత్రం..హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు తుది దశకు చేరుకున్నాయ. గణనాథుల నిమజ్జనానికి
సర్వం సిద్ధమైంది. సోమవారం నిమజ్జనానికి తరలివచ్చిన గణనాథులతో కిటకిటలాడుతున్న ట్యాంక్‌బండ్.