రాష్ట్రీయం

‘మూడో’ రుణమాఫీకి సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 5: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రుణ ఉపశమన పథకం కింద మూడో విడత రుణమాఫీ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు. మొదటి విడత 54.98 లక్షల రైతుల ఖాతాలకు 7564.69 కోట్లు జమ చేశామన్నారు. 50వేల లోపు రుణ ఉపశమనం అర్హత కలిగిన రైతులకు ఇందులో 23.76 లక్షల ఖాతాలకు 4,493 కోట్లు జమ చేశారు. 50వేలు పైబడి లక్షన్నర లోపల రుణ ఉపశమన అర్హత కలిగిన 31.22 లక్షల రైతుల ఖాతాలకు మొదటి వాయిదా 3071.69 కోట్లు జమచేశామన్నారు. ఈనెల 10వ తేదీ నుంచి మూడవ విడత రుణమాఫీ నిధులు రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని మంగళవారం ఆయన మీడియాకు వెల్లడించారు. రెండవ విడత 36.39 లక్షల రైతుల ఖాతాలకు 3300 కోట్లు విడుదల చేశామని, దశలవారీగా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వాటిలో 44వేల అర్హత కలిగిన రైతు ఖాతాలకు 96.25 కోట్లు జమచేశామన్నారు. మూడో విడత వాయిదా కింద 3600 కోట్లను 10 శాతం వడ్డీతో కలిపి బడ్జెట్‌లో పొందుపరిచి, దీనిలో 1000 కోట్లను రైతు సాధికార సంస్థ పిడి ఖాతాకు జమచేశామన్నారు. 2600 కోట్లను త్వరలో విడుదల చేస్తున్నామని, ఈనెల 10వ తేదీ నుండి సెప్టెంబర్ 30 లోపల 31.22 లక్షల రైతుల ఖాతాలకు మూడోవిడత నిధులు జమచేస్తామని మంత్రి తెలిపారు. రైతు సంక్షేమం గురించి తాము ఎవరి వద్దా పాఠాలు నేర్చుకోవలసిన పనిలేదని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.