రాష్ట్రీయం

పవిత్ర హారతి సమర్పించిన చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 5: భారతదేశంలోనే ఎంతో చరిత్ర కలిగిన కృష్ణానది ప్రవాహానికి ఇటీవలి కాలంలో అనేక అవరోధాలు వస్తున్నప్పటికీ ఆ నది నిరంతరం ప్రవహించాలని మనసా వాచా కోరుకుంటున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. జలహారతి కార్యక్రమంలో భాగం గా చంద్రబాబు మంగళవారం పవిత్ర సంగమం వద్ద భక్తిప్రపత్తులతో జల హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న మూడు మాసాల్లో రాష్ట్రం లో పెండింగ్‌లో ఉన్న 28 ప్రాజెక్టులను పూర్తిచేయాలనే సంకల్పంతో తామున్నామన్నారు. చుక్కనీరు కూడా వృథా చేయరాదని భావితరాలకు తెలియచెప్పేలా విస్తృత ప్రచారం చేయాల్సి ఉందని అన్నారు. దీనికి వరుణదేవుడు కూడా సహకరించాలని పూజలు చేస్తున్నామని, దీనిలో భాగంగానే నేడు పవిత్ర హారతి కార్యక్రమం చేపట్టామని అన్నారు. వాస్తవానికి ఇదొక మహాసంకల్పమని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సాగునీరు, మంచినీటి కోసం ఏ ఒక్కరూ ఎదురు చూడకూడదు, ఇబ్బందులు పడకూడదనేది తన అంతిమ లక్ష్యమన్నారు. అందుకే ప్రతి ఒక్క చుక్క వర్షపు నీటిని నిల్వ చేసేందుకు అనేక పథకాలు చేపట్టడంతో పాటు చెరువుల తవ్వకాలు, చెక్‌డ్యాంల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. వరుణదేవుడు కరుణించడంతో ఇప్పుడిప్పుడే ఆల్మట్టి నుంచి దిగువకు నీరు చేరుతున్నదని, త్వరలోనే శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు నిండగలవన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పలువురు మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.