రాష్ట్రీయం

సమితులతోనే సంక్షేమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 5: గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలకు ఊతమిచ్చేందుకు కాంగ్రెస్ హయాంలో ‘ఆదర్శరైతు’ విధానాన్ని ప్రవేశపెట్టగా, ప్రస్తుతం అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ ‘సమన్వయ సమితి’లను ఏర్పాటు చేస్తోంది. రైతులకు ఏదో ఒక విధంగా చేయూత ఇవ్వాలన్న ప్రభుత్వ విధానంలో అప్పటికీ (కాంగ్రెస్ హయాం), ఇప్పటికీ (టిఆర్‌ఎస్ హయాం) పెద్దగా తేడా ఏమీ లేదు. రాజకీయాలకు అతీతంగా ఆదర్శ రైతులను నియమిస్తామంటూ సమైక్యాంధ్రప్రదేశ్‌లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, వ్యవసాయ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి పదే పదే ప్రకటించారు. ఒక్కో గ్రామంలో ముగ్గురు అంతకు మించి కూడా ఆదర్శ రైతులను నియమించారు. సేద్యం చేస్తూ, అదే గ్రామంలో నివాసం ఉంటున్న వారినే ఆదర్శ రైతులుగా నియమించారు. వారిలో ఒక మహిళ తప్పని సరిగా ఉండాలని, ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు ప్రాధాన్యత ఇస్తామంటూ అప్పట్లో ప్రకటించారు. వాస్తవంగా నియామకాలు కూడా అదే విధంగా జరిగాయి. ఆదర్శరైతులకు డివిజన్ స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ పలు దఫాలుగా అప్పట్లో శిక్షణ ఇచ్చారు. ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని రైతులకు అందించడం, ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు రైతులకు అందివ్వడంలో ఆదర్శ రైతులే కీలక పాత్ర పోషిస్తారని అప్పట్లో ప్రచారం చేశారు. ఒక్కో ఆదర్శ రైతుకు వెయ్యి రూపాయల గౌరవ వేతనం కూడా ఇచ్చారు. ఆదర్శ రైతులను నామినేషన్ ప్రాతిపదికన నియమించారు. అయితే అప్పట్లో ప్రభుత్వం ఆశించిన మేరకు ఫలితాలు మాత్రం రాలేదు. ఆ తర్వాత ఆదర్శ రైతు విధానం కాలగర్భంలో కలిసిపోయింది.
ప్రస్తుతం టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన రైతు సమన్వయ సమితిల నిర్మాణం కూడా సరిగ్గా కాంగ్రెస్ హయాంలో కొనసాగిన దారిలో నడుస్తోంది. సమన్వయ సమితికి ఎంపికయ్యే సభ్యులు భూమి కలిగి ఉండాలని, సేద్యం చేస్తూ ఉండాలని, అదే గ్రామంలో నివాసం ఉండాలని షరతులు విధించారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రకారం గ్రామస్థాయి, మండలస్థాయి, జిల్లాస్థాయి, రాష్టస్థ్రాయిలలో ఏర్పాటయ్యే రైతు సమన్వయ సమితిల కోఆర్డినేటర్లను,
సభ్యులను నామినేన్ ప్రాతిపదికన నియమిస్తున్నారు. సెప్టెంబర్ 1న ఈ నియామకాలను ప్రారంభించారు. ఇప్పటికే తీసుకున్న నిర్ణయం ప్రకారం సెప్టెంబర్ 9 వరకు మొత్తం నియామకాలు పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇప్పటికే టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, (టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను లేని నియోజకవర్గాల్లో నియోజవర్గం స్థాయి పార్టీనేతలు) జాబితాలను రూపొందించడంలో నిమగ్నమై ఉన్నారు. ప్రతి జిల్లాకు ఒక మంత్రిని ఇంచార్జిగా ప్రభుత్వం నియమించింది. సదరు మంత్రి నేతృత్వంలో రూపొందించే రెవెన్యూ గ్రామ, మండలస్థాయి జాబితాలకు కలెక్టర్ ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. జిల్లాస్థాయి, రాష్టస్థ్రాయి సమితిలను ప్రభుత్వ సలహా మేరకు వ్యవసాయ కమిషనర్ నియమిస్తారు. సమన్వయ సమితి సభ్యులకు గౌరవవేతనం ఇస్తారా లేదా అన్నది ఇప్పటి వరకు స్పష్టం చేయలేదు. వీరి నియామకానికి సంబంధించి జీఓ జారీ అయినప్పటికీ, గౌరవవేతనం విషయం అందులో పేర్కొనలేదు. అయితే ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక పరమైన పథకాలు, కార్యక్రమాలు చేపట్టినా, రైతు సమన్వయ సమితుల ద్వారానే చేయాలని భావిస్తున్నది. రైతుల సమస్యలను పరిష్కరించే బాధ్యత రైతులపైనే పెడుతుండటంతో సత్ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. సమితులు స్వతంత్రంగా పనిచేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయం వాస్తవంగా ఏ విధంగా అమలవుతుందో వేచి చూడాల్సిందేనని నిపుణులు పేర్కొంటున్నారు.