ఆంధ్రప్రదేశ్‌

దూరప్రాంతాలకు 96 ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 5: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే 96 ప్రత్యేక రైళ్లను నడుపనుంది. సికిందరాబాద్-విజయవాడ-సికిందరాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (18 సర్వీసులు) రైళ్లు అక్టోబర్ 1,8,15,22,29 తేదీల్లో, నవంబర్ 5,12,19,26 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. అయితే ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు స్టేషన్లలో ఆగుతాయి. అదేవిధంగా తిరుపతి-కాకినాడ టౌన్-రేణిగుంట మధ్య (18 సర్వీసులు) అక్టోబర్ 1,8,15,22,29 నవంబర్ 5,12,19,26 తేదీల్లో నడుస్తాయి. ఈ ప్రత్యేక రైళ్లు శ్రీకాళహస్తి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడెపల్లిగూడెం, రాజమండ్రి, సామల్‌కోటలలో ఆగుతాయి. అదేవిధంగా తిరుపతి-నాగర్సోల్-తిరుపతి మధ్య (16 సర్వీసులు) అక్టోబర్ 6,13,20,27 తేదీల్లో, నవంబర్ 3,10,17,24 తేదీల్లో నడుస్తాయి. ఈ ప్రత్యేక రైళ్లు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, బేగంపేట్, లింగంపల్లి, శంకర్‌పల్లి, వికారాబాద్, జహిరాబాద్, బీదర్, భల్కి, ఉద్‌గిర్, లాతూర్ రోడ్డు, పన్‌గావ్, పర్లి, గంగాఖేర్, సేలు, ఔరంగాబాద్‌లలో ఆగుతాయి. హెచ్‌ఎస్ నాందేడ్-తిరుపతి మధ్య (18 సర్వీసులు) ప్రత్యేక రైళ్లు అక్టోబర్ 3,10,17,24,31 తేదీల్లో, నవంబర్ 7,14,21,28 తేదీల్లో నడుస్తాయని, ఇవి మడ్‌ఖడ్, ధర్మాబాద్, బాసర, నిజామాబాద్, కామరెడ్డి, మల్కాజ్‌గిరి, కాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంటలలో ఆగుతాయి. అదేవిధంగా హైదరాబాద్-జైపూర్-హైదరాబాద్ మధ్య (16 సర్వీసులు) ప్రత్యేక రైళ్లు అక్టోబర్ 6,13,20,27, నవంబర్ 3,10,17,24 తేదీల్లో నడుస్తాయి. ఈ ప్రత్యేక రైళ్లు మేడ్చల్, కామరెడ్డి, నిజామామాద్, ధర్మాబాద్, మడ్‌ఖేడ్, నాందేడ్, పూర్ణ, బాస్మత్, హింగోలి, వాషిమ్, మల్కాపూర్, బుర్హంపూర్, ఖాండ్వ, టర్సీ, భోపాల్, ఉజ్జయిని, నగ్డా, రాట్లమ్, మండసోర్, చిత్రగ్రహ్, భిల్వారా, అజ్మీర్, కిషన్‌గఢ్, ఫులేరా స్టేషన్లలో ఆగుతాయని ప్రజాసంబంధాల అధికారి తెలిపారు. అదేవిధంగా సికిందరాబాద్-రాక్సల్-సికిందరాబాద్ మధ్య (10 సర్వీసులు) అక్టోబర్ 3,10,17,24,31, నవంబర్ 6,13,20,27 తేదీల్లో నడుస్తాయి. ఈ ప్రత్యేక రైళ్లు కాజీపేట్ రామగుండం, మంచిర్యాల, బల్లార్షా, సేవాగ్రమ్, నాగపూర్, బీతుల్, ఇటార్సి, పిపారియా, జబల్‌పూర్, కత్ని, సంత, మణిక్‌పూర్, అలహాబాద్, జ్ఞాన్‌పూర్, మొకమ్, బరౌణి, సమస్తిపుర్, దర్బాంగాస్, సీతామర్హి, బైరాగణి స్టేషన్లలో ఆగుతాయని ప్రజాసంబంధాల అధికారి ఉమాశంకర్ కుమార్ పేర్కొన్నారు.