రాష్ట్రీయం

ఆయేషా మీరా హత్య కేసు పున:విచారణకు అనుమతించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 7: సంచలనం సృష్టించిన ఫార్మశీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసును పున:విచారణ చేసేందుకు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఎపి ప్రభుత్వం గురువారం హైకోర్టును అభ్యర్థించింది. ఈ మేరకు ఎపి హోంశాఖ ముఖ్య కార్యదర్శి హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. 2007లో విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద జరిగిన ఆయేషా మీరా హత్య కేసులో వాస్తవాలను వెలికితీసేందుకు పున:విచారణ చేపట్టాలని ఆయేషా మీరా తల్లిదండ్రులు, ప్రొ.రామ ఎస్ మెల్కోట్ మరో ఇద్దరు హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు.
ఈ పిటీషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ కేసులో ప్రభుత్వ ఉద్దేశ్యం ఏమిటి, పున:విచారణ చేపడతారా లేదా అనే అంశాలను తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఎపి ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ ఆదేశాలను అమలు చేస్తూ ఎపి హోంశాఖ ముఖ్య కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేశారు. ఎపి ప్రభుత్వం ఈ కేసును తిరిగి పరిశోధించేందుకు సిట్‌ను ఇప్పటికే నియమించిందని, అయితే ఇలాంటి కేసుల విషయంలో కోర్టు ఆదేశాలకు లోబడే నడుచుకోవాల్సి ఉన్నందున ప్రభుత్వం కిందికోర్టులో పిటీషన్ దాఖలు చేసిందని ఆ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇలాంటి పిటీషన్లపై ఉన్నత న్యాయస్థానమే నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉన్నందున, అక్కడ నుంచి ఆదేశాలు తెచ్చుకోవాలని సూచించడంతో హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్లు ప్రభుత్వం తరఫున న్యాయవాది ఎం.పద్మావతి తెలిపారు.
దీంతో ప్రభుత్వ అఫిడవిట్‌ను పరిశీలించి హైకోర్టు నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉంది.