రాష్ట్రీయం

ప్రయాణికుల క‘న్నీటి’ వెతలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 7: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్, సికిందరాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, నాందేడ్ డివిజన్లలోని రైళ్లలో నీళ్లు కరువయ్యాయి. రైల్వే స్టేషన్లలో ఉన్న కుళాయిలు పనిచేయడం లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులెదుర్కొనవలసి వస్తోంది. రైళ్లలోని టాయ్‌లెట్‌లలో నీళ్లు రాక..రైల్వే స్టేషన్లలో కుళాయిలు పనిచేయక..డబ్బులు పెట్టి వాటర్ బాటిళ్లను కొనలేక ప్రయాణికులు నీటి కోసం పడుతున్న వెతలు కోకొల్లలు. ఇటీవల కాలం నుంచి రైళ్లలో నీళ్లు ఉండడం లేదు. దక్షిణ మధ్య రైల్వేలో ప్రయాణించాలంటే చాలా ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణించాలంటే ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు మాత్రం స్వచ్ఛరైల్..స్వచ్ఛ్భారత్..కార్యక్రమాలను చేపడుతూ, ప్రయాణికుల భద్రత, మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని ప్రకటనలు గుప్పిస్తున్నారే తప్పా..ఆచరణలో శూన్యమనిపిస్తోందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఆయా స్టేషన్ల నుంచి ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు బయలుదేరిన మూడు,నాలుగు గంటల్లోపే నీళ్లు అయిపోతున్నాయి. ఏసీ బోగీల్లో తప్ప, ఇంకే బోగీలో నీళ్లుండడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. టాయిలెట్లలో నీళ్లు రాక ప్రయాణీకులు నరకయాతన పడుతున్నా..పట్టించుకునే నాథుడే లేడని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. టీసీలకు చెప్పినా తమకేమీ తెలియదంటున్నారు. కనీసం తాగే నీరు కూడా దొరక్క స్టేషన్లలో రైలు ఆపగానే సీసాలతో నీళ్లు పట్టుకునేందుకు పరుగులు తీసే ప్రయాణికులే ఎక్కువగా కనిపిస్తున్నారు. అత్యవసరమైతే మినరల్ వాటర్ కొనుక్కోవాల్సిందే. కొన్ని స్టేషన్లలో వాటర్ ప్యాకెట్లు అమ్ముతున్నారు. బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లలో నాణ్యత ఉండడం లేదని ప్రయాణికులు వ్యధ చెందుతున్నారు. కలిగిన వారు మినరల్ బాటిళ్లు కొనుక్కుంటుండగా, పేదలకు కనీసం మురికి నీరు కూడా దొకడం కష్టమవుతుందని ప్రయాణికులు నొచ్చుకుంటున్నారు. వాస్తవానికి సికిందరాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం స్టేషన్లలో నీరు నింపాలి. గతంలో వీటిని నింపే బాధ్యత రైల్వే అధికారులకే ఉండేది. కొనే్నళ్లుగా ఈ పని ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించారు. బోగీలకు నీరు నింపడానికి చాలా మంది లేబర్ అవసరం. ఈ వేతనాల ఖర్చు తగ్గించుకుంటూ కాంట్రాక్టర్లు డబ్బు మిగుల్చుకుంటున్నారు. ఏసీ బోగీలకు తప్ప, ఈ రూట్లలో ప్రయాణికులకు నీరు దొరకడం లేదు. ఇప్పటికైనా రైల్వే అధికారులు ప్రయాణికులకు కనీసం నీటి వసతినైనా అందుబాటులోకి తేవాలని ప్రయాణికులు కోరుతున్నారు.