రాష్ట్రీయం

పండుగల సందర్భంగా ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రైల్వేస్టేషన్), సెప్టెంబర్ 7: రానున్న దసరా, దీపావళి పండుగల దృష్ట్యా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కాచిగూడ - టాటానగర్ - కాచిగూడ మధ్య 18 ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసరు యు.ఉమాశంకర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నెంబరు 07438 కాచిగూడ నుంచి టాటానగర్ వెళ్లే ప్రత్యేక రైలు కాచిగూడలో అక్టోబరు 2,9,16,23,30న, నవంబర్‌లో 6,13,20,27 తేదీలలో మధ్యాహ్నం 13.00 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు టాటానగర్‌కు మరుసటి రోజు రాత్రి 19.45 గంటలకు చేరుతుంది. అలాగే తిరుగు ప్రయాణంలో 07439గా టాటానగర్ నుంచి కాచిగూడకు అక్టోబర్ 3,10,17,24,31, నవంబరులో 7,14,21,28 తేదీలలో రాత్రి 22.50కు బయలుదేరి రెండవ రోజు ఉదయం 5 గంటలకు కాచిగూడ చేరుతుంది. ఈ రైలు ఇరువైపులా మార్గమధ్యంలో మల్కాజ్‌గిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు జంక్షన్, విజయవాడ జంక్షన్, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బరంపూర్, ఖుర్థాంపట్టు, భువనేశ్వర్, భట్టక్, సుకిందరోడ్డు, కెథింజగత్, జరోలా, ఖన్సపాని, దంగాపోసి, చైబాషా స్టేషనులలో నిర్ణయించిన సమయాలలో నిలుస్తుంది. ఈ ప్రత్యేక రైలులో ఒక ఎసి టూటైర్, రెండు ఎసి త్రిటైర్, ఏడు స్లీపర్ రిజర్వేషన్ బోగీలు, ఆరు సెకండ్ అండ్ జనరల్ బోగీలు, రెండు లగేజీ కమ్ గార్డు బ్రేక్‌లతో కలిపి మొత్తం 18 బోగీలుగా నడుస్తుందని ఒక ప్రకటనలో తెలిపారు.