రాష్ట్రీయం

రెండే పత్రాలు చాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 7: విద్యుత్ రంగంలో సంస్కరణలను రాష్ట్రప్రభుత్వం వేగవంతం చేసింది. వ్యాపార నిర్వహణ సులభతరం సంస్కరణలో భాగంగా విద్యుత్ కనెక్షన్ల మంజూరు ప్రక్రియను సరళీకృతం చేశారు. విద్యుత్ కనెక్షన్లు కావాలంటే ఇకపై కరెంటు ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సిన పనిలేదు. బోలెడన్ని డాక్యుమెంట్లు అవసరం లేదు. రెండే రెండు డాక్యుమెంట్లతో కరెంట్ కనెక్షన్ పొందవచ్చు. ఈ వివరాలను సదరన్ విద్యుత్ డిస్కాం సిఎండి రఘుమారెడ్డి ప్రకటించారు. యాజమాన్య డాక్యుమెంట్‌తో పాటు విద్యుత్ సరఫరా ప్రణాళిక, భాగస్వామ్య డీడ్‌ను సమర్పిస్తే చాలు. కరెంటు కనెక్షన్ ఇచ్చేస్తారు. టిఎస్ ఐపాస్ కింద విద్యుత్ కనెక్షన్ పొందే ప్రక్రియను కూడా సులభతరం చేశారు. కరెంటు కనెక్షన్ ఇచ్చే విషయమై సాధ్యాసాధ్యాల నివేదిక మూడు రోజుల్లోస్తారు. ఏడు రోజులు ఎంత మొత్తం అవసరమో అంచనా నివేదిక ఇస్తారు. 15రోజుల గడువు అంచ నా మంజూరుకు ఇస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు విధానం, చెల్లింపులు, విద్యుత్ కనెక్షన్ దరఖాస్తు స్ధితిని అమలు చేస్తారు. రెండు సార్లు వినియోగదారులకు దరఖాస్తు పరిస్ధితిని వివరిస్తారు. దరఖాస్తు చేసినప్పుడు, సర్వీసును విడుదల చేసేటప్పుడు ఈ ఫీడ్ బ్యాక్ ఇస్తారు. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలులో దేశంలో మొదటి స్ధానం పొందింది. ఈ సారి కూడా సంస్కరణలను వేగవంతం చేసేందుకు అన్ని విధానాలను సులభతరం చేసినట్లు సిఎండి రఘుమారెడ్డి చెప్పారు. ఈ సారి ఫీడ్ బ్యాక్ మెకానిజం అనేకొత్త పద్ధతిని ప్రవేశపెట్టామన్నారు. ఈ విధానాలపై వివరించేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి 70 సంస్ధల నుంచి పారిశ్రామిక ప్రతినిధులు హాజరయ్యారని చెప్పారు. కంపెనీ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు ఉంచామన్నారు. ఈ సమావేశంలో చీఫ్ ఎలక్ట్రికల్ ఇనెస్పెక్టర్ ఏజి రమణ ప్రసాద్, డైరెక్టర్లు టి శ్రీనివాస్, జె శ్రీనివాసరెడ్డి తదితరులు హాజరయ్యారు.

చిత్రం..మీడియాతో మాట్లాడుతున్న సదరన్ విద్యుత్ డిస్కాం సిఎండి రఘుమారెడ్డి