రాష్ట్రీయం

రేణిగుంట ఎయర్‌పోర్టు ఆధునీకరణకు రూ.177 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, సెప్టెంబర్ 7: రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం ఆధునీకరణకు కేంద్ర విమానయాన శాఖ ఎఎఐ రూ.177.10 కోట్ల నిధుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేణిగుంట విమానాశ్రయానికి 2008లో అంతర్జాతీయ విమానాశ్రయ హోదా కల్పించి ఉండగా రన్‌వే చిన్నదిగా ఉండటం వలన పెద్ద విమానాల సర్వీసులు ఇంతవరకు ప్రారంభం కాలేదు. అయితే అంతర్జాతీయ రూట్స్‌లో ప్రయాణించే విమానాలు రేణిగుంట విమానాశ్రయంలో రాకపోకలు సాగించేవిధంగా ఇప్పుడున్న 150 అడుగుల వెడల్పు, 7503 అడుగుల పొడవు ఉన్న రన్‌వేను మరింత పెద్దదిగా వెడల్పు, పొడవు పెంచి అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగించే విధంగా, విమానాశ్రయ ఆధునీకరణ పనులకు రూ.177.10 కోట్లు వెచ్చించనున్నామని భారత విమానయాన శాఖ ఎఎఐ న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయంలో ఆమోదముద్ర వేశారు. ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయ ప్రహరీగోడను విస్తరించి ఉండగా విమానాశ్రయం వెలుపల అప్రాన్, ఐసోలేషన్ బే పనులు చురుగ్గా సాగుతుండగా ఈ ప్రాజెక్టు పూర్తయితే రేణిగుంట విమానాశ్రయం నుంచి ఎయిర్ ట్రాఫిక్ పెరుగుతుందని భావిస్తున్నారు.