రాష్ట్రీయం

ఇప్పట్లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల, సెప్టెంబర్ 8: భారత దేశంలో రానున్న దశాబ్దకాలంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం లేదని ఉభయ తెలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలేశుని దర్శనానికి శుక్రవారం ఇక్కడకు వచ్చిన ఆయన కొద్దిసేపు విలేఖర్లతో మాట్లాడారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అవసరమైతే చట్టసవరణ చేయాల్సి ఉంటుందన్నారు. 2018, జనవరి 1కి సంబంధించి కొత్త ఓటర్ల జాబితా తయారీ నవంబర్ 1నుంచి ప్రారంభం కానుందన్నారు. ఆ రోజుకు 18 ఏళ్లు నిండే వారంతా ఓటరుగా నమోదు కావచ్చునన్నారు. ప్రతి జిల్లాలో రాజకీయ నేతలతో సమావేశాలు ఏర్పాటుచేసి, పోలింగ్ స్టేషన్లు తదితర అంశాలపై చర్చించి, తదనుగుణంగా జాబితా తయారుచేస్తామన్నారు. ప్రస్తుతం ఉప ఎన్నికలు ఎక్కడా పెండింగ్‌లో లేవని, 2019 జనరల్ ఎన్నికల కోసం వేచి చూడాల్సిందేనన్నారు. ఇప్పటి వరకూ జాబితాలో నకిలీ ఓటర్లు లేరని, ఇక ముందు అటువంటి వాటికి తావివ్వబోమని విలేఖర్లు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2019లో జరిగే ఎన్నికలకు ముందు ఇంటింటికీ వెళ్లి జాబితాలను తమ సిబ్బంది మరోసారి పరిశీలిస్తారని తెలిపారు.