రాష్ట్రీయం

పెసర రైతుకు శుభవార్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8: తెలంగాణలో పెసర్లు కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. రెండు రోజుల క్రితం ఢిల్లీలో తెలంగాణ మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కేంద్ర వ్యవసాయ మంత్రి రాధా మోహన్‌సింగ్‌తో జరిపిన చర్చలు ఫలించాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ తెలంగాణ మార్క్‌ఫెడ్ సంస్థ సోమవారం నుంచి పెసర్ల కొనుగోలు ప్రక్రియ ప్రారంభించనుంది. కేంద్ర మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం డైరెక్టర్ శశిభూషణ్, నాఫెడ్ యండి సంజీవ్‌కుమార్‌లతో మంత్రి హరీశ్‌రావు శుక్రవారం సాయంత్రం ఫోన్‌లో మాట్లాడారు. పెసర్ల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పెసర్లు క్వింటాలుకు రూ.5575 రూపాయలను మద్దతు ధరగా నిర్ణయించినట్టు మంత్రి హరీశ్‌రావుకు కేంద్ర ఇంటర్వెన్షన్ స్కీం డైరెక్టర్ శశిభూషణ్ తెలిపారు. ఈ నేపథ్యంలో సచివాలయంలో తన చాంబర్‌లో మంత్రి హరీశ్‌రావు మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 20 నుంచి 25 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. పెసర్లు ఎక్కువగా పండే ప్రాంతాలను గుర్తించి అక్కడ కొనుగోలు కేంద్రాలను నాఫెడ్ ప్రారంభించనుంది. కేంద్ర ప్రభుత్వం పెసర్లకు మద్దతు ధర ప్రకటించినందున రైతులు తొందరపడి తక్కువ రేటుకు అమ్ముకోవద్దని హరీశ్‌రావు సూచించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్‌మోహన్, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, జాయింట్ డైరెక్టర్ లక్ష్మణుడు తథితర అధికారులు పాల్గొన్నారు.

చిత్రం.అధికారుల సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు