రాష్ట్రీయం

శ్రీశైలం ప్రాజెక్టుపై రెండు రాష్ట్రాల కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8: శ్రీశైలం ప్రాజెక్టుకు అంతంతమాత్రంగా వచ్చిన వరద నీటి ప్రవాహంతో నీటి మట్టం 812.7 అడుగులకు, నీటి లభ్యత 35.93 టిఎంసికి పెరగడంతో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు ఈ నీటి వినియోగంపై కన్ను వేశాయి. రెండు రాష్ట్రాలు ఈ నీటిని వినియోగించుకోవడం కసరత్తును ప్రారంభించాయి. ఈ నెలలో జరిగే కృష్ణా బోర్డు సమావేశంలో శ్రీశైలం నీటిని దిగువున ఉన్న నాగార్జునసాగర్‌కు విడుదల చేయాలని తెలంగాణ బలంగా వాదించనుంది. కాగా ఈ నీటిని విడుదల చేస్తే రాయలసీమ ప్రాంతం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందని ఏపి ప్రభుత్వం వాదిస్తోంది. శ్రీశైలం నుంచి నీటిని దిగువకు విడుదల చేసి ఆ నీటితో జల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం, సాగర్‌కు చేరిన నీటితో హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల మంచినీటి అవసరాలకు వినియోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. కృష్ణా బేసిన్‌లో నాగార్జునసాగర్, శ్రీశైలం కలిసి రెండు ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్ధ్యం 527 టిఎంసి ఉండగా, ఇప్పుడు 150 టిఎంసి మాత్రమేలభ్యతగా ఉంది. పట్టిసీమ గోదావరి జలాల ద్వారా కృష్ణా డెల్టాకి ఆంధ్రప్రదేశ్ అందిస్తోందని, ప్రస్తుతం శ్రీశైలం నీటిలో కనీసం 10 టిఎంసి నీటిని మంచి నీటి అవసరాలకు నాగార్జునసాగర్‌కు కేటాయించాలని తెలంగాణ కోరుతోంది. దీని వల్ల హైదరాబాద్ మంచి నీటి అవసరాలు వచ్చే రెండు నెలలకు ఢోకా ఉండదని భావిస్తున్నారు. ఆల్మట్టి నుంచి నీటి పవాహనం 6023 క్యూసెక్కులకు పడిపోయింది. ప్రస్తుతం జూరాల నుంచి 27,820 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా, శ్రీశైలంకు 19251 క్యూసెక్కులు చేరుతున్నాయి. అడపదడపా కురిసే వర్షాల వల్ల ఈ నెలాఖరుకు శ్రీశైలంలో నీటి నిల్వ 40 టిఎంసికి చేరుకోవచ్చని సాగునీటి నిపుణులంటున్నారు. తుంగభద్రలో నీటి నిల్వ 100.86 టిఎంసికి 72.56 టిఎంసి చేరుకుంది.
197 మండలాల్లో వర్షపాతం లోటు
తెలంగాణలో 197 మండలాల్లో -59 నుంచి -20 శాతం వరకు వర్షపాతం లోటు నమోదైంది. ఈ వర్షాకాలం సీజన్‌లో సాధారణ వర్షపాతం 613.5ఎంఎంకు కేవలం 545 ఎంఎం నమోదైంది. మొత్తం -11 శాతం లోటు వర్షపాతం నమోదైంది. గరిష్టంగా భద్రాది కొత్తగూడెంలో 835.1 ఎంఎం, కనిష్టంగా నాగర్‌కర్నూల్‌లో 314 ఎంఎం వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో రెండు జిల్లాలు హైదరాబాద్, జోగుళాంబ జిల్లాల్లో 20 శాతం అదనంగా వర్షపాతం, 19 జిల్లాల్లో సాధారణ, 3 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 31 జిల్లాల నుంచి వ్యవసాయ శాఖకు అందిన సమాచారం ప్రకారం మొత్తం 43.24 లక్షల హెక్టార్లలో 36.91 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు అవుతోంది. రాష్ట్రంలో లభ్యతలో ఉన్న భూమిలో 87 శాతం భూమిని ఖరీఫ్ సాగులోకి తెచ్చారు. గత ఏడాది కంటే ఒక లక్ష హెక్టార్లలో ఈ ఏడాది ఖరీఫ్ సాగవుతోంది.