రాష్ట్రీయం

కన్నడిగుల దౌర్జన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 9: బ్యాంకు రిక్రూట్‌మెంట్ బోర్డు, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు నిర్వహించిన ఎంపిక పరీక్షలు రాసేందుకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల యువతపై బెంగళూరు, హుబ్లీ పట్టణాల్లో కన్నడిగులు దాడులకు తెగబడ్డారు. కర్నాటక వచ్చి పరీక్షలు రాస్తే ఇక్కడి వారు ఏం కావాలంటూ కన్నడ సంఘాల ప్రతినిధులు దాడులకు దిగడంతో ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు భయబ్రాంతులయ్యారు. ప్రధానంగా బెంగళూరు, హుబ్లీ రైల్వే స్టేషన్లలో హైదరాబాద్, విజయవాడ నుంచి దిగిన వారిని ప్రశ్నించి మరీ దాడులు చేయడం గమనార్హం. పరీక్ష కేంద్రాల వద్ద తెలుగు అభ్యర్ధుల హాల్‌టిక్కెట్లు లాక్కుని చించేశారు. దీంతో పరీక్షలను రద్దు చేసినట్టు తెలుస్తోంది. రైళ్లలో కర్నాటక రాష్ట్రం బెంగళూరు, హుబ్లీ పట్టణాల్లో ఆర్‌ఆర్‌బి, ఐబిపిఎస్ ఎంపిక పరీక్షలు రాసేందుకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్ధులపై జరిగిన దాడిపై ఏపీ సిఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. కర్నాటక సిఎస్‌తో మాట్లాడాలని సిఎం ముఖ్యకార్యదర్శి సతీష్ చంద్రను ఆదేశించారు. అమరావతిలో జరిగిన తెదేపా సమన్వయ కమిటీ సమావేశంలో ఈ అంశాన్ని మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రస్తావనకు తెస్తూ కన్నడిగుల దాడులతో తెలుగు అభ్యర్ధులకు జరుగుతున్న నష్టంపై వివరించినపుడు సిఎం తీవ్రంగా స్పందించారు.
తెలుగువారి ప్రయోజనాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఘటనలపై ఉప ముఖ్యమంత్రి (హోం) చినరాజప్ప స్పందించారు. ఆంధ్రులపై కర్నాటకలో దాడులు జరగడం
దురదృష్టకరమన్నారు. భవిష్యత్తులో దాడులు జరుగకుండా చూసేందుకు కేంద్రంతో, ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదిస్తున్నామన్నారు. ఆంధ్రుల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, జాతీయస్థాయి పోటీ పరీక్షల కేంద్రాలను విశాఖ, విజయవాడల్లో ఏర్పాటు చేయాలని కోరతామన్నారు. ప్రతిభ ఆధారంగా ఆంధ్ర ప్రాంతం వారు ఎంపికవుతుంటే, కన్నడ సంఘాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.
అసలు వివాదం ఏమిటి?
ఐబిపిఎస్, ఆర్‌ఆర్‌బి గ్రూప్-సి, గ్రూప్-డి పోస్టులకు బెంగలూరు ప్రాంతీయ కేంద్రంగా నిర్వహిస్తున్న ఎంపిక పరీక్షలకు ఈసారి 9 వేల మంది హాజరయ్యారు. అందులో తెలుగు రాష్ట్రాల నుండే దాదాపు 4వేల మంది హాజరయ్యారు. గతంలో ఈ పోస్టులకు ప్రాంతీయ భాషల్లో ప్రావీణ్యత తప్పనిసరి అనే నిబంధన ఉండేది గత ఏడాది ఈ నిబంధనను కేంద్రం తొలగించి, వేరే ప్రాంతీయ భాష అభ్యర్ధులు ఎంపికైతే వారికి స్థానిక భాష నేర్చుకునేందుకు ఆరు నెలల గడువు ఇస్తూ నిబంధనలను సడలించింది. ఈ నిబంధనతో గత ఏడాది ఎంపిక పరీక్షలో కర్నాటక నుండి ఆరు వేల మంది హాజరైతే స్థానిక అభ్యర్ధులు కేవలం 400 మంది ఎంపికయ్యారు. మిగిలిన రాష్ట్రాల వారే 2500 మంది ఎంపికయ్యారు. దాంతో గత ఏడాదికాలంగా కర్నాటకలో ఈ అంశం భగ్గుమంటోంది. కర్నాటక డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ ఎస్ జి సిద్ధరామయ్య ఇటీవల కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లిని కలిసి రిక్రూట్‌మెంట్ అంశంలో భాషా వివాదాన్ని వివరించారు. కర్నాటక ప్రభుత్వం సైతం స్థానిక పోస్టుల భర్తీకి స్థానిక భాషను నిర్బంధం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.