రాష్ట్రీయం

అక్టోబర్‌లోనే స్పష్టత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 9: వచ్చే జిఎస్‌టి మీటింగ్‌లోనే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై జిఎస్‌టి తగ్గింపుపై స్పష్టత వస్తుందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న వర్క్స్ కాంట్రాక్టుపై జిఎస్‌టి సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నామని, ఇప్పటికే 18 శాతం నుంచి 12 శాతం వరకు తగ్గించారన్నారు. దీనికి ఇంకా తగ్గించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కోరారన్నారు. వర్క్స్ కాంట్రాక్ట్స్‌ను నిర్వచించాలని కౌన్సిల్ ఫిట్మెంట్ కమిటీకే సూచించారన్నారు. ప్రభుత్వం చేపట్టే పనులన్నింటికీ పన్ను తగ్గిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అక్టోబర్ 24న ఢిల్లీలో జరిగే జిఎస్‌టి కౌన్సిల్ సమవావం దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారని, స్పష్టత వస్తుందని ఆయన అన్నారు. జిఎస్‌టి సమావేశం అనంతరం ఆయన తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ, గ్రానైట్, బీడీల టాక్స్‌పై కూడా జిఎస్‌టిని తగ్గించాలని కోరామన్నారు. ఈ అంశాన్ని కూడా ఫిట్మెంట్ కమిటీకే కౌన్సిల్ రెఫర్ చేసిందన్నారున. వచ్చే సమావేశంలో ఈ అంశాన్ని అజెండాగా పెట్టి చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. ఎట్టి పరిస్ధితుల్లో పేదవాడిమీద భారం పడకుండా చూడాలి అనేది సిఎం కెసిఆర్ అలోచన అని దానికి అనుగుణంగా జిఎస్‌టి కౌన్సిల్‌ల్లో వాదనలు వినిపిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రజాప్రయోగ పథకాలపై 18 నుంచి 12 శాతానికి ఇప్పటికే తగ్గించారన్నారు. ప్రజా సంక్షేమ పధకాలపై పన్ను భారం ఉండకూడదని సిఎం కెసిఆర్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.