రాష్ట్రీయం

బోగస్‌లను ఏరేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 9: రాష్ట్రంలో అనధికారికంగా నిర్వహిస్తున్న వ్యవసాయ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. గిరిజన ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇకపై 24 గంటలూ తెరచి ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కోన గ్రామంలోని క్యాప్టీవ్ పోర్టును స్విస్ ఛాలెంజ్ విధానంలో కమర్షియల్ పోర్టుగా మార్చే ప్రతిపాదనను ఆమోదించింది. భోగాపురం ఇంటర్నేషనల్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. వెలగపూడి సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన శనివారం మంత్రివర్గం సమావేశమైంది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవీ.
* అనధికారిక వ్యవసాయ కళాశాలలపై ప్రభుత్వానికి నివేదిక అందజేసేందుకు వీలుగా విచారణ కమిటీని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం
* జలసిరికి హారతి కార్యక్రమాన్ని ఏటా సెప్టెంబర్ 6, 7, 8 తేదీల్లో అధికారికంగా జరపాలని నిర్ణయం. ఏరువాక, వనం- మనంను ఏటా నిర్వహించాలి.
* గిరిజన ప్రాంతాల్లో పిహెచ్‌సిలు 24 గంటలూ పనిచేసేలా నిర్ణయం.
* వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉప కులపతి ఎంపిక చేసే సెర్చ్ కమిటీలో మార్పులు.
* పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తిలో పిపి పద్ధతిలో నిర్వహిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ అభివృద్ధి పనులను ఎస్సీఎల్ టర్బో కన్సార్టియంకు అప్పగిస్తూ నిర్ణయం. దీనిని 368 కోట్లతో నిర్మించనున్నారు.
* సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్, యాక్సిస్ వెంచర్స్ ఇండియా అభ్యర్థన మేరకు
837 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి ప్రాథమిక ఆమోదం.
* రాష్ట్రంలోని వివిధ శాఖల్లో 148 పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం
* మహిళా కేసుల సత్వర పరిష్కారానికి 12 స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేస్తూ గతంలో జారీచేసిన ఉత్తర్వులను నిర్ధారిస్తూ నిర్ణయం.
* రాబోయే శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ యాక్ట్ బిల్లుకు ఆమోదం.
* భూసేకరణ నిమిత్తం ఏపిఐఐసి తీసుకున్న 2వేల కోట్ల రూపాయల రుణం నుంచి కియో మోటార్స్ పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన వౌలిక వసతుల కల్పనకు సొమ్ము చెల్లించాలని నిర్ణయం
* నెల్లూరు జిల్లా బొద్దువారిపాలెంలో మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్‌కు 110 ఎకరాల భూమి కేటాయింపు
* విశాఖ జిల్లా మధురవాడ ఏరియా హిల్ నెం.3లో రెండెకరాల భూమిని ఇన్నోమైండ్స్ సాఫ్ట్‌వేర్‌కు చదరపు మీటరుకు రూ.5,600 చొప్పున ఇచ్చేందుకు నిర్ణయం
* ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ సవరణకు ఆమోదం
* పట్టణ, ఇతర ప్రాంతాల్లో నివాస, నివాస యోగ్యం కాని సముదాయాల్లో అద్దెల క్రమబద్ధీకరణ, అద్దెదారుల హక్కులు, తదితర వివాదాలను పరిష్కరించేందుకు గతంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను బిల్లు రూపంలో తెచ్చేందుకు ఆమోదం
* కృష్ణా పుష్కరాల సందర్భంగా పద్మావతి, విశే్వశ్వర ఘాట్ల దగ్గర ఇళ్ల తొలగింపులో నిర్వాసితులైనవారికి పునరావాసం కోసం 17.69 కోట్ల రూపాయల చెల్లింపునకు ఆమోదం
* సాగునీటి ప్రాజెక్టుల కోసం తక్కువ వడ్డీతో బహిరంగ మార్కెట్ నుంచి 3వేల కోట్ల రూపాయల రుణాన్ని సమీకరించేందుకు జలవనరులశాఖ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్
* ఐఎంఎఫ్‌ఎల్‌కు సంబంధించిన ప్రొక్యూర్‌మెంట్‌పై జస్టిస్ రామానుజం సిఫార్స్‌లకు మంత్రిమండలి ఆమోదం
* భోగాపురం ఇంటర్నేషనల్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి 448 ఎకరాలను ఎకరాకు 12.5 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించేందుకు ఆమోదం. మండల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో భూమిని కేటాయించేందుకు కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
* కృష్ణాజిల్లా గుణదలలో రేంజ్ ఆఫీస్ భవన నిర్మాణానికి ఏసిబి డైరెక్టర్ జనరల్‌కు స్థలం బదలాయింపు
* తూర్పుగోదావరి జిల్లా కడియంలో ఫ్లోరి కల్చరల్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు 10.77 ఎకరాలను ఐకార్‌కు కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

చిత్రం..ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం