రాష్ట్రీయం

తేల్చాల్సింది అపెక్సే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 9: తెలుగు రాష్ట్రాల మధ్య రావణకాష్టంలా మండుతున్న జల జగడాల పరిష్కారానికి అపెక్స్ (కేంద్ర అత్యున్నత మండలి) భేటీ ఒక్కటే మార్గంగా కనిపిస్తోందంటూ కృష్ణా, గోదావరి బోర్డులు కేంద్ర జలవనరుల శాఖకు నివేదిక ఇచ్చాయి. మరోవైపు శ్రీశైలంలో నీటిమట్టం 37 టిఎంసికి చేరుకోవడం, ఆల్మట్టి నుంచి వస్తున్న వరదతో జలాశయంలో నీటిమట్టం పెరుగుతోంది. దీంతో శ్రీశైలం నుంచి రెండు టిఎంసి నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేయాలని, దీనివల్ల హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల దాహార్తి తీరుతుందన్న తెలంగాణ ప్రతిపాదనకు ఆంధ్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయలేదు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కృష్ణా బోర్డు వెంటనే సమావేశమై శ్రీశైలం నుంచి నీరు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ పరిణామాల నేపథ్యంలో కృష్ణా బోర్డు త్వరలో సమావేశమై శ్రీశైలం జలాల విడుదల వివాదంపై సమీక్షించనుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం కింద కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జల వివాదాల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలి. ఇందులో కేంద్ర జలవనరుల మంత్రి, ఆంధ్ర, తెలంగాణ సిఎంలు సభ్యులుగా ఉంటారు. ఈ సమావేశం గత సెప్టెంబర్‌లో జరిగింది. ప్రస్తుతం కృష్ణా బోర్డులో అధికారులతోవున్న త్రిసభ్య సంఘం సమావేశం వల్ల పాలసీ విధానం ఖరారు చేయలేరని రెండు బోర్డులు కేంద్ర జలవనరుల శాఖకు తెలిపాయి. రెండు
రాష్ట్రాలు పరస్పరం అనుమతిలేని ప్రాజెక్టులపై ఫిర్యాదులు చేసుకుంటున్నాయని, ఈ సమస్య సిఎంలస్థాయి సమావేశంలోనే పరిష్కారం అవుతుందని నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది.
శ్రీశైలంనుంచి నీటి విడుదలకు నో
శ్రీశైలం జలాశయం నుంచి రెండు టిఎంసి నీటిని విడుదల చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనను ఆంధ్ర అధికారికంగా ఆమోదించలేదు. నాగార్జునసాగర్‌లో 115 టిఎంసి జలాలు ఉన్నాయని, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు స్కీంకు ఎత్తిపోతల ద్వారా నీటినితోడి మంచినీటి అవసరాలు తీర్చుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. ఈ సీజన్‌లో శ్రీశైలానికి 16.16 టిఎంసి నీరు రాగా, నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 4.39 టిఎంసి నీరు మాత్రమే వచ్చింది. సాగర్‌లో ఇప్పుడున్న నీరు మరో 15 రోజులకే సరిపోతుందని, శ్రీశైలం నుంచి 2 టిఎంసి నీరు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. ఒకవేళ ఏపీ నీటిని విడుదల చేయనిపక్షంలో విద్యుదుత్పత్తి చేసి నీటిని విడుదల చేసేదిశగా తెలంగాణ యోచిస్తోంది. కాగా శ్రీశైలం బ్యాక్ వాటర్‌పై ఆధారపడి నిర్మించిన మచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా 12 పంపుల్లో 4 పంపుల నుంచి నీటిని ఆంధ్ర ప్రభుత్వం తోడుకుంటూ మళ్లిస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. రోజుకు 3850 క్యూసెక్కుల నీటిని తోడుతున్నారని సమాచారం. మచ్చుమర్రి వద్ద ప్రస్తుతం టెలిమెట్రీ పరికరం లేదు. కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాల్లో కృష్ణా బేసిన్‌లో పలుచోట్ల టెలిమెట్రీ పరికరాలను అమర్చింది.
ఆల్మట్టినుంచి పెరిగిన ప్రవాహం
కాగా ఆల్మట్టి నుంచి గత నాలుగు రోజులుగా పడిపోయిన నీటి ప్రవాహం మళ్లీ పెరిగింది. శనివారం 11023 క్యూసెక్కుల నీరు, నారాయణ్‌పూర్ నుంచి 12,599 క్యూసెక్కుల నీరు, తెలంగాణలోని జూరాల నుంచి 29315 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి చేరుతోంది. ఒక్క రోజులో శ్రీశైలంలో నీటిమట్టం 35 నుంచి 37 టిఎంసికి చేరింది.