రాష్ట్రీయం

ఉల్లి రైతును ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 9: ఉల్లి ధరలు అనూహ్యంగా పతనం కావడంతో రైతును ఆదుకునేందుకు వీలుగా టన్ను ఉల్లిని ఆరువేల చొప్పున మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని రాష్ట్ర మార్కెటింగ్, గిడ్డంగులు, పశుసంవర్థక, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, సహకార శాఖల మంత్రి ఆదినారాయణరెడ్డి శనివారం ప్రకటించారు. మొన్నటిదాకా ఉల్లికి ధర బాగానే ఉన్నా, రైతుల చేతికి పంట విరివిగా రాగానే టన్ను ధర నాలుగు వేలకు పడిపోయిందన్నారు. ఈ పరిస్థితిని గమనించి రైతును ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించుతున్నామని తెలిపారు. గతంలో పసుపు, శెనగలకు ధరలు పడిపోయినప్పుడు కూడా మార్క్‌ఫెడ్ ద్వారా ఆ పంటలను రైతునుంచి కొనుగోలు చేసినట్టు తెలిపారు. గత కొంతకాలంగా నిలకడగా ఉన్న ఉల్లి ధరలు నెల క్రితం హఠాత్తుగా టన్ను ధర 15వేల నుంచి 20వేలకు పెరిగిపోయిందన్నారు. దీంతో ఉల్లి సాగును రైతాంగం ఎక్కువ చేసిందన్నారు. రాష్ట్రం నుంచి తమిళనాడుకు, ఢిల్లీకి ఎక్కువగా ఉల్లి ఎగుమతి అయ్యేదన్నారు. అయితే ఇప్పుడు రాష్ట్రం నుంచి ఎగుమతులకు డిమాండ్ కొంత తగ్గిందన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి పెరగడం, తమిళనాడు నుంచి డిమాండ్ తగ్గడం వల్ల ఒక్కసారిగా ఉల్లి ధర టన్నుకు నాలుగువేల రూపాయలకు పడిపోయిందన్నారు. ఫలితంగా ఉల్లి రైతు దారుణంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ పరిస్థితులన్నింటినీ పరిశీలించి తక్షణం టన్ను ఆరువేల రూపాయలకు తగ్గకుండా రైతుల నుంచి కొనుగోలు చేసి రైతుబజార్లలో విక్రయించాలని నిర్ణయించామని ఒక ప్రకటనలో మంత్రి ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. ఉల్లి, టమాటా లాంటి పంటలను దీర్ఘకాలం నిల్వ ఉంచలేని పరిస్థితి ఉన్నందున, వీటి ధరల్లో నిలకడ సాధ్యం కాదని మంత్రి తెలిపారు. డిమాండ్, సరఫరాల్లో భారీ వ్యత్యాసాలు వచ్చేస్తున్నాయని వివరించారు. సాంకేతికత అందుబాటులో ఉన్నందున మార్కెట్ డిమాండ్, ఇతర ప్రాంతాల్లో పంటల సాగు తదితరాలన్నింటినీ క్షుణ్ణంగా తెలుసుకునే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయన్నారు. ఈ అవకాశాలను రైతులు వినియోగించుకుని మార్కెట్ అవసరాలను గమనిస్తూ పంట విస్తీర్ణాన్ని పెంచడం, తగ్గించడం లాంటివి చేపడితే ఇలాంటి ఒడిదుడుకులు రైతుకు ఎదురుకావని మంత్రి అన్నారు. రైతును ఈ మేరకు చైతన్యం చేసే కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వపరంగా చేపడుతూనే ఉన్నామని వివరించారు.