రాష్ట్రీయం

తెలంగాణ ఆకాంక్ష నెరవేరుస్తా: జైట్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 9: నీటిపారుదల ప్రాజెక్టులు, తాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అమలు చేస్తున్న జిఎస్‌టిపై తెలంగాణ ప్రభుత్వం కోరికను నెరవేరుస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో శనివారం జరిగిన 21 జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం తర్వాత మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, వివిధ ప్రాజెక్టు పనులపై ఇప్పటి వరకు ఉన్న జిఎస్‌టిని 18 శాతం నుండి 12 శాతానికి తగ్గిస్తూ గత సమావేశంలోనే నిర్ణయించామని గుర్తు చేశారు. దీన్ని పూర్తిగా ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వ కోరుతున్న అంశంపై పరిశీలన చేస్తున్నామని, ‘పనులు’ అన్న పదానికి నిర్వచనం విస్తృతం చేస్తామని, దాంతో కొంత వెసులుబాటు లభిస్తుందన్నారు. ప్రాజెక్టు పనులపై లభించే ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకే చేరుతుందని జైట్లీ తెలిపారు. 21 జిఎస్‌టి కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఇచ్చిన సహకారానికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని కేంద్ర మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 21 పర్యాయాలు జిఎస్‌టి కౌన్సిల్ సమావేశాలు జరగగా, మూడు సమావేశాలు ఢిల్లీ బయట జరిగాయని, హైదరాబాద్‌లో ఈరోజు జరిగిన కౌన్సిల్ సమావేశం మూడోదని, మిగతా 18 సమావేశాలు ఢిల్లీలోనే జరిగాయని వివరించారు.