రాష్ట్రీయం

బ్లూ వేల్‌పై సర్కారు వల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 9: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న బ్లూవేల్ గేమ్ కట్టడికి ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. బ్లూవేల్ గేమ్ బారిన పడుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ముందస్తుగానే ఈ అంశంపై దృష్టిసారించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. దాంతో ఈ నెల 15వ తేదీన యాజమాన్యాలతో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కిషన్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. అలాగే పాఠశాలల్లో సెల్‌ఫోన్లు వాడుతున్న విద్యార్ధులపై కనే్నసి ఉంచడం, వారి అలవాట్లు , ప్రవర్తనపై నిఘా పెట్టాలని కూడా పాఠశాల విద్యాశాఖాధికారులు యాజమాన్యాలకు సూచిస్తున్నారు. వీలైనంత వరకూ సెల్‌ఫోన్లను తరగతి గదుల్లోకి అనుమతించవద్దని, అలాగే విద్యార్ధులపై నిరంతరం దృష్టి సారించాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. బ్లూవేల్ గేమ్ ఆడుతూ గేమ్‌లో భాగంగా పలు టాస్క్‌లు చేస్తూ విద్యార్ధులు అందులో లీనమై మానసికంగా, శారీరకంగా కృంగిపోతూ టాస్క్‌లో భాగంగా తమ పరాజయాలను భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న తీరుపై విద్యావేత్తలు, సామాజిక వేత్తలు తీవ్రంగా స్పందించడంతో పాఠశాల విద్యాశాఖాధికారులు పోలీసులతో సమావేశమై సామాజిక మాద్యమాల్లో బ్లూవేల్ గేమ్‌తో సంబంధం ఉన్న సాఫ్ట్‌వేర్ కట్టడికి ఉన్న అవకాశాలపై అధ్యయనం చేస్తున్నారు.