రాష్ట్రీయం

అందరికీ నీరు, నెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: తెలంగాణలో రానున్న ఆరు నెలల్లో ప్రతి ఇంటికీ స్వచ్చమైన తాగునీరు, ఇంటర్‌నెట్ అందిస్తామని ఐటి, పంచాయతీరాజ్ మంత్రి కెటి రామారావు ప్రకటించారు. శనివారం ఢిల్లీలో ప్రముఖ స్కోచ్ సంస్థనుంచి ఐటీ మినిష్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న అనంతరం మాట్లాడుతూ దేశంలోనే ప్రతి ఇంటికీ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్‌నెట్ సేవలు అందించే తొలి రాష్ట్రం తెలంగాణ అవుతుందన్నారు. ప్రత్యేకంగా బ్రాడ్ బ్యాండ్ వ్యవస్థ ఏర్పాటు చేయకుండా, ఉన్న వ్యవస్థను ఉపయోగించి ముందుకు వెళ్తున్నామన్నారు. స్కోచ్ సంస్థ అధ్యక్షుడు సమీర్ కొచ్చార్ మాట్లాడుతూ మంత్రి కెటిఆర్ ఐటీ రంగం అభివృద్ధికి చేస్తున్న కృషిని కొనియాడారు. ఐటీ పరిశ్రమ అభివృద్ధికి వినూత్న విధానాలు అవలంభిస్తున్నారని కోచార్ ప్రశంసించారు. రామారావు స్కోచ్ ప్రదర్శనశాలలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఐటి స్టాల్‌ను సందర్శించారు. ఇదిలాఉంటే రామారావు శనివారం మధ్యాహ్నం రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలుసుకుని అభినందనలు తెలిపారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

చిత్రం..ఐటీ మినిష్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకుంటున్న మంత్రి కెటిఆర్