రాష్ట్రీయం

మళ్లీ.. ఐసిస్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ రాజేంద్రనగర్, సెప్టెంబర్ 9: హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) జాడలు మళ్లీ కనిపించడం కలకలం రేపుతోంది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు శనివారం ముగ్గురు ఐసిస్ అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. టోలీచౌకీకి చెందిన అబ్దుల్ మాలిక్, ఫజియుల్లా, ఖయ్యూంలను రాజేంద్రనగర్- బండ్లగూడలోని సన్‌సిటీ రెసిడెన్సీలో అదుపులోకి తీసుకున్నారు. ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న విషయంపై ఎన్‌ఐఏ అధికారులు విచారిస్తున్నట్టు సమాచారం. కాగా వీరు హైదరాబాద్‌లో ఉంటూ ఉత్తరప్రదేశ్‌లో భారీ విధ్వంసం సృష్టించేందుకు పథకం వేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. శనివారం లక్నో నుంచి వచ్చిన ఎన్‌ఐఏ బృందం టోలిచౌకీ, బండ్లగూడ, రాజేంద్రనగర్‌లో తనిఖీలు నిర్వహించారు. కాగా అబ్దుల్ మాలిక్ ఐసిస్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నట్టు సమాచారం. నగర శివారులోని రాజేంద్రనగర్- బండ్లగూడలో జాతీయ దర్యాప్తు సంస్థ నిర్వహించిన సోదాలతో ఒక్కసారిగా పరిసర ప్రాంతాలు ఉలిక్కిపడ్డాయి. కాగా ఫజియుల్లా, ఖయ్యూం ఇద్దరూ అబ్దుల్ మాలిక్ కుమారులని తెలిసింది. వీరి ఇంటి నుంచి నిషేధిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. వీరు ఇంటర్నెట్ ద్వారా ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఎన్‌ఐఏ గుర్తించినట్టు తెలిసింది. స్థానిక పోలీసుల సహకారంతో వీరిని విచారణ నిమిత్తం ఢిల్లీ తీసుకువెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం.