రాష్ట్రీయం

కోహినూర్‌లా వెలగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 10: రాజధాని అమరావతిలో నిర్మించనున్న అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు తుది డిజైన్లు ఖరారయ్యాయి. ఈ నెల 13న వీటికి ఆమోద ముద్ర పడనుంది. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో నార్మన్ అండ్ ఫోస్టర్స్ సంస్థ ప్రతినిధులు సోమవారం సమావేశం కానున్నారు. ఈ భవనాలకు సంబంధించి డిజన్లను ఈసందర్భంగా ఖరారు చేసే అవకాశం ఉందంటున్నారు. రాజధాని అమరావతిలో వివిధ భవనాల నిర్మాణాలపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్, అమరావతి నగరాభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ లక్ష్మీపార్థసారథి, సిఆర్‌డిఏ కమిషనర్ శ్రీ్ధర్, తదితరులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయదశమి రాష్ట్రానికి విజయాలను అందించనుందన్నారు. ‘ప్రపంచ ప్రఖ్యాతి లభించేలా ప్రధాన భవన నిర్మాణాల ప్రక్రియకు ఈ దసరా సుముహూర్తం కానుంది. ప్రజాస్వామ్యంలో శాసన వ్యవస్థకు అత్యున్నత వేదికైన అసెంబ్లీ భవన నిర్మాణానికి ఆరోజు శ్రీకారం చుడదాం. అసెంబ్లీ మాదిరిగా అమరావతి నగరం కూడా కోహినూర్‌లా వెలగాలి. ప్రజారాజధానిలో ప్రతి నిర్మాణంలో ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించాలి. నిర్మాణాల నాణ్యతలో రాజీపడే ప్రసక్తి లేదు’ అంటూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాజధానిలో అన్ని ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలను, ఆధునీకరణను కలగలపాలని, 1350 ఎకరాల్లో నిర్మించే పరిపాలనా భవనాలు సామాన్యుడి హక్కుగా మారాలన్నారు. విద్యుత్ సౌధ భవన సముదాయాలను ఉద్యోగుల్లో ఆహ్లాదం నింపేలా నిర్మించారని, పోలీస్ ప్రధాన కార్యాలయాన్ని కూడా చూస్తే ముచ్చటేస్తోందన్నారు. రాజధానిలో నిర్మించే ప్రతి పరిపాలనా భవనం ఆహ్లాదకరంగా ఉండాలన్నారు. అసెంబ్లీ, రాజ్‌భవన్, హైకోర్టు, సచివాలయం, ఉద్యోగుల, అధికారుల గృహ సముదాయం, సిఎం, మంత్రుల గృహ సముదాయాలు ప్రపంచ శ్రేణిలో ఉండాలని చంద్రబాబు సూచించారు.
ప్రభుత్వ పాలనా భవనాలు సహా ప్రైవేట్, వైద్య, విద్య, పరిశ్రమలు, వాణిజ్యం, వినోదం అన్నీ ఉన్నప్పుడే నగర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. నదీ తీరప్రాంతాన్ని సెంట్రల్ విస్టా, క్యాపిటల్ స్క్వేర్‌లుగా అభివృద్ధి చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. విద్యుత్, నీరు పొదుపుగా ఉపయోగించేలా మాస్టర్ ప్లాన్‌లో ఏర్పాట్లు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ భవనాలను ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో నిర్మిస్తున్నామని, సెంట్రల్ విస్టా కృష్ణానది నుంచి శాఖమూరు పార్క్ వరకూ విస్తరించి ఉంటుందని వివరించారు. కోహినూర్ వజ్రాకృతిలో అసెంబ్లీ భవనం ఉంటుందని, 250 మంది ఎమ్మెల్యేలు, 100 మంది ఎమ్మెల్సీలకు సరిపడా ఈ భవనం ఉంటుందని తెలిపారు. హైకోర్టు భవనం బౌద్ధస్థూపంలా ఉంటుందని, 37 కోర్టు హాళ్లు ఉంటాయని, మరో 27 హాళ్లు నిర్మించేందుకు అనువుగా ఉంటుందని అధికారులు వివరించారు.

చిత్రాలు.. ముఖ్యమంత్రి చంద్రబాబు *హైకోర్టు భవన నమూనా