రాష్ట్రీయం

వెల్లువెత్తుతున్న సాంకేతిక విప్లవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 10: నూతన ఆలోచనలతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యపడుతుందని ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఫెయిర్ 2017లో భాగంగా ‘సపోర్టింగ్ ఇన్నోవేటివ్ ఎంటర్ ప్రెన్యూర్స్ అండ్ రోల్ ఆఫ్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్’ అంశంపై ఆదివారం ఇక్కడ జరిగిన సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతిక రంగం లో అంతర్జాతీయంగా వస్తున్న సరికొత్త ఆలోచనలు ఒకే వేదికపై పంచుకోవడం ద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ధిలో పయనిస్తాయన్నారు. గతంలో పలు పారిశ్రామిక విప్లవాలు జరిగినప్పటికీ ఆయా దేశాలు అభివృద్ధి సాధించేందుకు దశాబ్దాల కాలం పట్టిందన్నారు. అయితే, ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని సింగపూర్ వంటి చిన్న దేశం రెండున్నర దశాబ్దాల కాలంలోనే అత్యంత వేగంగా పురోభివృద్ధి సాధించిందన్నారు. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ కూడా రెండు దశాబ్దాల కాలంలోనే అగ్రగామిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు సుపరిపాలన అందించే లక్ష్యంతో సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని అమల్లోకి తెచ్చామని, బయోమెట్రిక్, ఆధార్ లింకేజ్ వంటి చర్యలతో పథకాల్లో పారదర్శకతతో పాటు అవినీతిని అరికట్టగలిగామన్నారు. తద్వారా రాష్ట్రంలో 11.5 శాతం వృద్ధి రేటు సాధించామన్నారు. దేశంలోనే తొలిసారిగా విద్యుత్ స్తంభాల ద్వారా ఫైబర్ నెట్ కనెక్షన్లు ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో మానవ వనరులకు, మేథో సంపత్తికి కొదవ లేదని లోకేష్ స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటి నిపుణల్లో 35 శాతం మంది తెలుగువారేనన్నారు. నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టే ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. యనైటెడ్ నేషన్స్ ఆసియా, పసిఫిక్ సాంకేతిక బదిలీ కేంద్రం ప్రతినిధి మిచికో ఎనోమోటో మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సుస్థిర అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ భారత్ అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. భారతదేశం ఐటి ఇన్నోవేషన్స్ ప్రదర్శనా కేంద్రంగా కాకుండా, వాటిని అనుసంధానం చేసుకుని అమల్లోకి తెస్తే మరింత వృద్ధి సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. అలాగే భారత పారిశ్రామిక వేత్తలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. ఇండియన్ ఇన్నోవేషన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎఎస్ రావు మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయంగా వస్తున్న ఆధునిక ఆలోచనలను ఒకే వేదికపై పంచుకోవడం ద్వారా సాంకేతిత పరిజ్ఞాన మార్పిడి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో విశాఖ ఎంపి కంభంపాటి హరిబాబు, ఐటి శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయానంద్, ఐటి సలహాదారు జెఎ చౌదరి, ఎపి ఇన్నోవేషన్ టెక్నాలజీ సిఇఓ వి.వల్లీ కుమారి తదితరులు ప్రసంగించారు.

చిత్రం..ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్స్ ఫెయిర్‌లో ప్రసంగిస్తున్న ఐటి మంత్రి నారా లోకేష్