రాష్ట్రీయం

నీరుగార్చిన జిఎస్‌టి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇరిగేషన్ ప్రాజెక్టులు, వౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించి జిఎస్‌టి మినహాయింపుపై జిఎస్‌టి సమావేశంలో ఎటువంటి ఉపశమనం లభించలేదు. రాష్ట్రప్రభుత్వం ఈ మీటింగ్‌పై ఎన్నో ఆశలుపెట్టుకుంది. ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి జిఎస్‌టి అమలులోకి వచ్చింది. దీని వల్ల రాష్ట్రప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్‌రూం ప్రాజెక్టులతో సహా మొత్తం రూ. 19600 కోట్ల అదనపు భారం పడింది. కాని ఈ విషయాన్ని సవాలుగా తీసుకుని ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్రంపై పోరాడారు. దీని వల్ల జిఎస్‌టిని 18 నుంచి 12 శాతానికి తగ్గించారు. అయినా భారం మాత్రం కొనసాగుతోంది. ఈ భారం రూ.9 వేల కోట్లకు తగ్గింది. తెలంగాణ రాష్ట్రం మొదటి నుంచి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై జిఎస్‌టి భారాన్ని ఐదు శాతానికి తగ్గించాలి లేదా పూర్తిగా ఎత్తివేయాలని కోరుతోంది. జిఎస్‌టిని తగ్గించని పక్షంలో తమ ప్రభుత్వం న్యాయపోరాటం చేస్తామని కెసిఆర్ గతంలో ప్రకటించారు. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కెసిఆర్ హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత ఉన్నత స్ధాయి అధికారుల సమావేశాన్ని నిర్వహించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
హైదరాబాద్‌లో శనివారం జరిగిన జిఎస్‌టి సమావేశంలో రాష్ట్రప్రభుత్వం జిఎస్‌టి భారాన్ని భరించలేమని మొరపెట్టుకున్న ఫలితం కనపడలేదు. ఈ విషయమై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కూడా సానుకూలంగా ప్రకటన చేయలేదు. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు చేపట్టిన కాంట్రాక్టులకు అదనంగా ఏడు శాతం సొమ్మును కూడా చెల్లించింది. జిఎస్‌టి భారం వల్ల తాము చురుకుగా ప్రాజెక్టు పనులు చేపట్టలేకపోతున్నామని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వచ్చే జిఎస్‌టి సమావేశం అక్టోబర్ 24వ తేదీన ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశంలో తాము లేవనెత్తిన అంశాలపై స్పష్టత వస్తుందని ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. వర్క్ కాంట్రాక్ట్స్‌పై వెసులుబాటు లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జిఎస్‌టి అమలులోకి రాకముందు చేపట్టిన ప్రాజెక్టులకు మాత్రమే వస్తుసేవాపన్ను వర్తించకుండా చూడాలని తెలంగాణ రాష్ట్రప్రభుత్వంతో పాటు మరి కొన్ని ఇతర రాష్ట్రాలు కోరుతున్నాయి. రాష్ట్రప్రభుత్వం వత్తిడి వల్ల రూ.6వేల కోట్ల వరకు ఉపశమనం లభించినా, ఇది చాలదని, సంక్షేమ పథకాలపై ఆర్ధిక భారం ప్రభావం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.