రాష్ట్రీయం

శ్రీశైలం ప్రాజెక్టు నీటి విడుదలపై అనిశ్చితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10:శ్రీశైలం ప్రాజెక్టు నీటిపై ఏపి, తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతోంది. కనీసం రెండు టిఎంసి నీటిని ఇవ్వాలన్న తెలంగాణ కోరికను ఏపి తిరస్కరించడంతో, కరెంటును ఉత్పత్తి చేసి నీటిని విడుదల చేయడంపై తెలంగాణ దృష్టిని సారించింది. ఏపి ప్రభుత్వం శనివారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ విషయమై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఒక రోజు 900 మెగావాట్ల కెపాసిటీ పనిచేస్తే ఐదు టిఎంసి నీరు దిగువకు విడుదలవుతుంది. ఈ విధంగా నీటిని వినియోగించుకునే సదుపాయం తెలంగాణకు ఉంది. కాగా శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం లభ్యతలో ఉన్న నీటిని వినియోగించి జల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ఆలోచన ఏమీ ఇప్పు డు లేదని తెలంగాణ జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు పవర్ హౌస్ తెలంగాణ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ నుంచి 900 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చును. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 819 అడుగుల నీటి మట్టం వద్ద అందుబాటులో ఉన్న 40 టిఎంసి నీటిని వినియోగించుకుని జల విద్యుత్ చేసే అవకాశం లేదని దేవులపల్లి ఆంధ్రభూమికి చెప్పారు. ఈ ప్రాజెక్టులో నీటి మట్టం 834 అడుగులకు చేరాల్సి ఉంది. అప్పుడే జల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామన్నారు. 834 అడుగుల వద్ద జల విద్యుత్ ఉత్పత్తికి ఎవరి అనుమతి అవసరంలేదన్నారు. ప్రస్తుతం ఈ జలాశయానికి ఆశించిన స్ధాయిలో నీటి ప్రవాహం లేదన్నారు. ఈ ఏడాది ఈ ప్రాజెక్టుల్లో ఇన్‌ఫ్లోస్ ఆశాజనకంగా లేవన్నారు.
కాగా ఫ్లోరైడ్ బాధిత నల్లగొండ జిల్లాలో మంచినీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. శ్రీశైలంనుంచి నీటిని విద్యుత్ ఉత్పత్తిద్వారా దిగువకు విడుదల చేయాలని నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఇంజనీర్లు రాష్ట్రానికి లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టం 834 అడుగులు ఉంటే తప్ప విద్యుత్‌ను ఉత్పత్తి చేయరాదన్న జీవో 69ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 1996లో జారీ అయింది. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జీవో 107ను విడుదల చేసింది. దీని ప్రకారం 854 అడుగుల వద్దకు చేరుకునే వరకు నీటిని వినియోగించుకోరాదని ఆదేశించిన విషయం విదితమే. కాగా శ్రీశైలానికి వరద నీటి ప్రవాహం 39705 క్యూసెక్కులు ఉంది. ప్రస్తుతం 40.63 టిఎంసి నీరుంది. ఆల్మట్టి నుంచి 11023 క్యూసెక్కులు, నారాయణ్‌పూర్ నుంచి 11302 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.
14 ప్రాజెక్టులపై పరస్పరం ఫిర్యాదు
తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి, డిండి, సీతారామ, భక్తరామదాస, తుమ్మిళ్ల, కంతనపల్లి వంటి ప్రాజెక్టులను అనుమతులు లేకుండా నిర్మిస్తోందని ఏపి ప్రభుత్వం కేంద్ర జలవనరుల శాఖకు ఫిర్యాదు చేసింది. ఏపి ప్రభుత్వం పులికనుమ, సిద్ధాపురం, గాజులదినె్న, గుండ్రేవుల, శివభాష్యంసాగర్, మునే్నరు, ముచ్చుమర్రి, గురు రాఘవేంద్ర, ఆర్డీఎస్ కుడికాల్వ ప్రాజెక్టులు అక్రమమైనవని వీటికి అనుమతులు లేకుండా ఏపి ప్రభుత్వం నిర్మిస్తోందని తెలంగాణ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. కేంద్రం మాత్రం వీటిపై ఇంతవరకు స్పందించలేదు.