రాష్ట్రీయం

‘సామాజిక స్మగ్లర్లు..’ వివాదాస్పదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: ఆర్య వైశ్యులపై కంచ ఐలయ్య రాసిన ‘సామాజిక స్మగ్లర్లు.. కోమటోళ్లు’ పుస్తకం వివాదస్పదమైంది. ఈ పుస్తకాన్ని రాయడంపై ఆర్య వైశ్య సంఘాలు తీవ్ర నిరశన తెలిపాయి. ఈ పుస్తకం ఆర్యవైశ్యులను కించపరిచే విధంగా ఉందని, కనుక తక్షణమే ఈ ఆ పుస్తకాన్ని నిషేధించడంతో పాటు రచయతపై చర్యలు తీసుకోవాలని ఆ సామాజికవర్గ నేతలు చేస్తున్నారు. పలుచోట్ల ఐలయ్య దిష్టిబొమ్మలను, పుస్తకం ప్రతులను దగ్ధం చేశారు. ఓయూ, పంజగుట్ట పోలీస్ స్టేషన్లలో ప్రొఫెసర్ ఐలయ్యపై ఫిర్యాదు చేశారు.
ప్రాణహాని ఉందంటూ ఐలయ్య ఫిర్యాదు
మరో వైపు ఆర్యవైశ్య సంఘం నేతలు తనను ఫోన్‌లో బెదిరిస్తున్నారంటూ ఐలయ్య కూడా ఓయూ పిఎస్‌లో ఫిర్యాదు చేశారు. ‘సామాజిక స్మగ్లర్లు.. కోమటోళ్లు’ అనే మాటలో తప్పేమీ లేదన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పుస్తకంపై ఆర్యవైశ్య సంఘాలు కోర్టుకు వెళ్లి చట్టపరంగా సమస్యను పరిష్కరించుకోవాలని, అంతేతప్ప తనను చంపేస్తామని, నాలుక కోస్తామని బెదిరించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఆర్యవైశ్య సంఘాలతో తనకు ప్రాణానికి ముప్పు ఉందన్నారు. తాను బతికి ఉన్నంతకాలం ఏమైనా జరిగితే దానికి ఆర్యవైశ్య సంఘాలదే బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. దేశ పౌరుడిగా, తెలంగాణ రాష్ట్ర ఓటరుగా సీఎం తనకు పూర్తి రక్షణ కల్పించాలని ఐలయ్య కోరారు.
ఇటువంటివి రాయడం తగదు : రోశయ్య
సామాజిక స్మగ్లర్లు..కోమటోళ్లు అనే పుస్తకం ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని రాసినట్టుగా ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య అన్నారు. ఈ పుస్తకంలోని అభ్యంతరాలపై ఐలయ్యతో ఆర్యవైశ్యులు చర్చించాలన్నారు. ఓ సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసకుని పుస్తకాలు రాయడం తగదన్నారు. సంస్కృతి పరంగా సామాజికవర్గ ఆహార అలవాట్లు ఉంటాయని, వాటి విమర్శించడం సరికాదని హితవు పలికారు.