రాష్ట్రీయం

ఇక తెలుగు నిర్బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: వచ్చే విద్యాసంవత్సరం నుండి తెలంగాణలో ని అన్ని పాఠశాలల్లో మొదటి తరగతి నుండి 12వ తరగతి వరకూ కచ్చితంగా తెలుగు భాషను సబ్జెక్టుగా బోధించాలని సిఎం చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. ఈమేరకు త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని, అనంతరం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు తదుపరి చర్యలు చేపట్టాలని మంగళవారం సూచించారు. తెలుగును కచ్చితంగా బోధించే పాఠశాలలకు మాత్రమే తెలంగాణలో అనుమతి ఉంటుందన్నారు. ఉర్దూ కోరుకునే విద్యార్థులకు ఉర్దూ భాషను కూడా ఆప్షనల్ సబ్జెక్టుగా ఉంచాలని నిర్ణయించారు. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, ఇంటర్మీడియట్ తరగతుల్లో బోధించే తెలుగు సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ రూపకల్పన చేయాల్సిందిగా సాహిత్య అకాడమిని ఆదేశించారు. వెంటనే సిలబస్ రూపొందించి, పుస్తకాలను ముద్రించాలని పేర్కొన్నారు. సాహిత్య అకాడమి రూపొందించిన సిలబస్‌నే అన్ని పాఠశాలలు బోధించాలని, ఎవరిష్టం వచ్చినట్టు వారు పుస్తకాలు ముద్రించుకోవడం కుదరదని కూడా సిఎం స్పష్టం చేశారు. పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టును బోధించడం, సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో ప్రభుత్వం రూపొందించిన సిలబస్‌నే బోధించడం విషయంలో ప్రభుత్వం కఠినంగా, ఖచ్చితంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణలో నిర్వహించే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఇకపై తమ నామఫలకాలను ఖచ్చితంగా తెలుగులోనే రాయాలని సిఎం పిలుపునిచ్చారు. ఇతర భాషల్లో రాసుకోవడం అనేది నిర్వాహకుల ఇష్టమన్నారు. ఈ రెండు నిర్ణయాలకు సంబంధించి త్వరలోనే జరిగే మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేస్తామని, తదుపరి ఇందుకు సంబంధించి ఉత్తర్వులు ఇస్తామని చెప్పారు.