రాష్ట్రీయం

విశ్వస్థాయే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 14: తమ రాష్ట్రం ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్యంలో దేశంలోనే అగ్రగామిగా ఉందని, ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదగాలన్నది తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఇంధన సామర్థ్యంలో ప్రపంచంలో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, మేలిమి పద్ధతులను రాష్ట్రానికి తీసుకురావాలని కోరారు. రాజధాని అమరావతిలో ఆకుపచ్చ, స్థిరమైన ఆవాసాల నిర్మాణంలో సహకారం అందించేందుకు ముందుకు వచ్చిన ది ఎనర్జీ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (టెరి)తో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ, ఆంధ్రప్రదేశ్ ఇంధన సామర్థ్య అభివృద్ధి సంస్థ గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో ప్రాథమిక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. అమరావతిలో ‘టెరి’ కార్యాలయ భవనాన్ని ప్రారంభించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కోరారు. ఇంధన రంగంలో సామర్థ్యం, పొదుపు రెండూ ఎంతో ముఖ్యమన్నారు. వ్వయసాయ రంగానికి, పారిశ్రామిక రంగానికి, గృహావసర వినియోగానికి ఇంధనం ఎంతో అవసరమని, ఉత్పాదనలో సామర్థ్యం, వినియోగంలో పొదుపు పాటించడం తక్షణ కర్తవ్యమన్నారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తికి స్పందిస్తూ టెరి డైరెక్టర్ జనరల్ అజయ్ మాధుర్.. దేశంలో ఇంధన రంగ అభివృద్ధికి చొరవ తీసుకుని అద్భుతాలు సృష్టిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి పనిచేయడం గర్వకారణంగా భావిస్తున్నట్లు తెలిపారు. అమరావతిలో హరిత భవనాలు, స్థిర ఆవాసాల నిర్మాణంలో భాగస్వామి కావడం తమకు మహదావకాశమని అన్నారు. రాజధానిలో కార్యాలయ భవనాల నుంచి ప్రతి నిర్మాణం గ్రీన్ కానె్సప్టులో ఉండేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామని హామీ ఇచ్చారు. ఈ విధానంలో 40 శాతం ఇంధనం ఆదా అవుతుందని, ఈ అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతను అభినందిస్తున్నట్లు అజయ్ మాధుర్ చెప్పారు.
ప్రాథమిక అవగాహన ఒప్పందం ప్రకారం రాజధానిలో నిర్మాణాలకు టెరి సంపూర్ణ సహకారం అందిస్తుంది. అంతేకాక రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయ్యేదాకా ఏపి సిఆర్‌డిఎకు సాంకేతిక సహకారం అందిస్తుంది. నగరంలో స్థిరమైన ఆకుపచ్చ భవనాలకు ఆకృతి నివ్వడంలో అండగా ఉంటుంది. అవగాహనా ఒప్పందం మూడేళ్ల పాటు అమలులో ఉంటుంది. ప్రాథమిక అవగాహన ఒప్పంద పత్రాలపై ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి, ప్రాధికార సంస్థ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్, ఆంధ్రప్రదేశ్ ఇంధన సామర్థ్య అభివృద్ధి సంస్థ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, టెరి డైరెక్టర్ అజయ్ మాధుర్ ముఖ్యమంత్రి సమక్షంలో సంతకాలు చేసి ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. కార్యక్రమంలో మంత్రి నారాయణ, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సీఎం సమక్షంలో ఎంఓయు కుదుర్చుకున్న దృశ్యం