రాష్ట్రీయం

కోనేరు మధుకు సంబంధం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: ఎమ్మార్ ప్రాపర్టీస్ స్కాం కేసులో కోనేరు మధు పాత్ర ఉందని చేసిన అభియోగాలకు ఎటువంటి సాక్ష్యం లేదని పూర్వ అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగి హైకోర్టుకు తెలిపారు. ఈ కేసును జస్టిస్ బి శివశంకర్ రావు విచారించారు. ఈ కేసులో నిందితుడు కోనేరు మధు తరఫున ముకుల్ వాదనలు వినిపిస్తూ ఈ విల్లాల కొనుగోలు, అమ్మకాల్లో తన క్లైంట్‌కు ఎటువంటి పాత్ర లేదన్నారు.
ఈ కేసులో పార్థసారథి, చల్లా సురేష్ అనే వ్యక్తులు వరుసగా తన క్లైంట్ బ్యాంకు ఖాతాల్లో రూ. 1.05 కోట్లు, రూ.65 లక్షల సొమ్ము డిపాజిట్ చేసినట్లు చెప్పారని, ఈ సొమ్మును కూడా వాపసు ఇచ్చేశారని తెలిపారు. ఈ కేసు చార్జిషీటు నుంచి తన క్లైంట్ పేరును తొలగించాలని కోర్టును అభ్యర్థించారు అనంతరం ఈ కేసు విచారణను ఈ నెల 18వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.