రాష్ట్రీయం

యాదాద్రికి భారీసాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: యాదాద్రి ఆల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ ఐదో దశ నిర్మాణానికి అవసరమైన రూ.4009 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అంగీకరించింది. దీంతో నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన యాదాద్రి ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన నిధులు నూటికి నూరుశాతం సమకూరినట్టయ్యింది. ఐదో యూనిట్ నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయం అందించడానికి అంగీకరింస్తూ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సిఎండి రాజీవ్‌శర్మ విద్యుత్ సౌధలో శుక్రవారం జెన్కో సిఎండి ప్రభాకరరావుకు ఈమేరకు లేఖ అందించారు. ఒక్కొక్కటి 800 చొప్పున ఐదు యూనిట్లు నెలకొల్పి నాలుగు వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా దామరచర్లలో సూపర్ క్రిటిక్ టెక్నాలజీతో యాదాద్రి పవర్ ప్లాంట్ నెలకొల్పుతున్నారు. ఇందులో మొదటి నాలుగు యూనిట్ల నిర్మాణానికి అవసరమైన రూ.16950 కోట్ల ఆర్ధిక సాయం అందించడానికి ఆర్‌ఇసి ఇప్పటికే అంగీకరించింది. ఐదో యూనిట్‌కు పిఎఫ్‌సి ముందుకొచ్చింది. తాజా రుణంతో తెలంగాణ విద్యుత్ సంస్థలైన జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌లలో పిఎఫ్‌సి అందిస్తున్న ఆర్ధిక సాయం రూ.28210 కోట్లకు చేరింది. ఇప్పటికే ఈ నాలుగు సంస్థలకు పిఎఫ్‌సి రూ.16156 కోట్ల చెల్లింపులు కూడా జరిపింది. యాదాద్రి పవర్ ప్లాంట్‌లోని ఐదో యూనిట్‌కు ఆర్థిక సాయం లభించడం పట్ల జెన్కో చైర్మన్ ప్రభాకర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. పిఎఫ్‌సి సిఎండి రాజీవ్‌శర్మకు కృతజ్ఞతలు తెలిపారు. నీటిపారుదల ప్రాజెక్టులకు, 24 గంటల వ్యవసాయ విద్యుత్‌కు ఇతర భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు విద్యుదుత్పత్తి పెంచడంలో యాదాద్రి ప్లాంటుది అత్యంత కీలకపాత్ర అని దేవులపల్లి ప్రభాకరరావు చెప్పారు. అంతటి ప్రాధాన్యంవున్న ప్లాంట్‌కు ఇటీవల పర్యావరణ అనుమతులతోపాటు అన్ని రకాల అనుమతులు వచ్చాయన్నారు. ఇప్పుడు నిర్మాణానికి అవసరమైన నిధులు కూడా నూటికి నూరుశాతం సమకూరాయన్నారు. సిఎం కెసిఆర్ ఆదేశాల ప్రకారం యాదాద్రి ప్లాంట్ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తామన్నారు.

చిత్రం..ఆర్థికసాయం ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న ప్రతినిధులు