రాష్ట్రీయం

సమాచార హక్కు చట్టం సిసిగా సదారామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్‌కు చీఫ్ కమిషనర్‌గా రాష్ట్ర శాసనసభ పూర్వ కార్యదర్శి రాజా సదారామ్‌ను, కమిషనర్‌గా పాత్రికేయుడు బుద్దా మురళిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీచేసింది. వీరి పదవీ కాలం ఐదేళ్లుంటుంది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ప్రతిష్టాకరమైన రాష్ట్ర సమాచార కమిషన్‌కు తొలి చీఫ్ కమిషనర్‌గా రాజా సదారామ్‌ను నియమించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సదారామ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శిగా ఎనిమిదేళ్లు పనిచేసి అందరి మన్ననలు పొందారు. అసెంబ్లీ రిపోర్టర్‌గా 41 ఏళ్లక్రితం అసెంబ్లీలో ఉద్యోగంలో చేరిన సదారామ్ అంచలంచెలుగా పదోన్నతులు పొంది అసెంబ్లీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ కార్యదర్శిగా పదవి విరమణ చేసినప్పటికీ, అప్పటి ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా అసెంబ్లీ కార్యదర్శిగా కొనసాగారు. ఒకదశలో సిఎం కెసిఆర్ అసెంబ్లీలో సదారాం సేవలను కొనియాడుతూ అసెంబ్లీ కార్యదర్శి పోస్టును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమాన హోదాకు పెంచాలన్న ఆలోచన ఉన్నట్లు ప్రకటించిన సంగతి విదితమే.
సమాచార కమిషనర్‌గా నియమితులైన బుద్దా మురళి ఆంధ్రభూమిలో మూడు దశాబ్ధాలుగా రాజకీయ విశే్లషణ వార్తలు, వ్యాసాలు, వ్యంగ్య రచనలతో అందరి ప్రశంసలు పొందారు. ప్రస్తుతం ఆంధ్రభూమి చీఫ్ రిపోర్టర్‌గా పనిచేస్తున్న బుద్దామురళి సామాజిక మార్పులు, రాజకీయ పరిణామాలపై అనేక వ్యాసాలు రాశారు. జనాంతికం, ఓటమే గురువు పుస్తకాలు రాశారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో 1964 ఏప్రిల్ 2న సాధారణ కుటుంబంలో జన్మించిన బుద్దా మురళి విద్యాభ్యాసం తర్వాత జర్నలిజంలో చేరారు. ఆంధ్రభూమిలో మెదక్, నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల స్ట్ఫా రిపోర్టర్‌గా పనిచేశారు. అంచలంచెలుగా పాత్రికేయ వృత్తిలో ఎదిగి చీఫ్ రిపోర్టర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ సామాజిక, రైతాంగ, ఉద్యోగ సమస్యలతో పాటు మానవ ప్రవృత్తి, మనస్తత్వాలపై ఆయన అధ్యయనం చేశారు.

చిత్రాలు..రాజా సదారామ్ *బుద్దా మురళి