రాష్ట్రీయం

జల కళతో రాజోలిబండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, సెప్టెంబర్ 15: ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులోని రాజోలిబండ ఆనకట్ట జలకళ సంతరించుకుంది. సుమారు 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో 62 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. దీంతో మూడు గేట్లు తెరిచి దిగువ తుంగభద్ర నదిలోకి విడుదల చేశారు. శనివారం మరో 30 వేల క్యూసెక్కుల నీరు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఆదోని డివిజన్‌లోని చిన్నచిన్న నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ నీరంతా తుంగభద్రకు చేరుకుంటోంది. రెండు రోజుల్లో ఈ నీరు శ్రీశైలం జలాశయం చేరుకుంటుందని భావిస్తున్నారు.