రాష్ట్రీయం

సరళతర వాణిజ్యంలో తెలంగాణ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 16: సరళతర వాణిజ్యంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని ఐటి మంత్రి కె.తారకరామారావు అన్నారు. దీంతో పాటు వ్యాపార ఖర్చు తగ్గించడం, నాణ్యత పెంచడం ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. శనివారం బేగంపేటలోని హరిత ప్లాజాలో సరళతర వాణిజ్య విధానంపై పరిశ్రమల శాఖ అవగాహన సదస్సు నిర్వహించింది. సదస్సులో మంత్రి మాట్లాడుతూ పెట్టుబడులు, వాణిజ్య రంగంలో తెలంగాణ వేగాన్ని అసోచమ్ నివేదిక స్పష్టం చేసిందన్నారు. పారిశ్రామికంగా అగ్రభాగాన ఉన్నప్పటికీ గతేడాది 372 కొత్త సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలని ఇద్దరు రిజర్వు బ్యాంక్ గవర్నర్లను కోరిన ఏకైక మంత్రిని తానేనని కెటిఆర్ ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలను కాపాడుకునేందుకు పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నామన్నారు. దీనిలో భాగంగా మూతపడిన పరిశ్రమలను పునరుద్దరించేందుకు ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. పరిశ్రమలపై జిఎస్‌టి భారం గురించి కేంద్రానికి వివరించామని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న పారిశ్రామిక వేత్తలే బ్రాండ్ అంబాసిడర్లు అని సిఎం కెసిఆర్ చెబుతుంటారని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు.

చిత్రం..సరళతర వాణిజ్య విధానంపై పరిశ్రమల శాఖ నిర్వహించిన అవగాహన
సదస్సులో ఐటీ మంత్రి కెటిఆర్, పరిశ్రమల శాఖ ప్రతినిధులు