రాష్ట్రీయం

త్వరితగతిన కేసులు పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 16: వినియోగదారుల ఫోరంలో దాదాపు 10 వేల కేసులు గత 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని సుప్రీంకోర్టు అపాయింటెడ్ కమిటి (ఎస్‌సిఎసి) చైర్మన్ జస్టిస్ అర్జిత్ పశాయత్ పేర్కొన్నారు. వినియోగదారుల ఫోరంల రెండురోజుల ప్రాంతీయ సమావేశాన్ని శనివారం హైదరాబాద్‌లోని మెర్క్యూరీ హోటల్‌లో ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వాలు వినియోగదారుల ఫోరంల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నాయని గత 18 నెలలల్లోతాము చేసిన పర్యటనల సందర్భంగా గుర్తించామన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే వినియోగదారుల ఫోరంలలో చైర్మన్లు, మెంబర్ల ఖాళీలు భర్తీ కావడం లేదని, దాంతో కేసులు వేల సంఖ్యలో పెండింగ్‌లో ఉంటున్నాయన్నారు. వినియోదారుల ఫోరంల సభ్యుల వేతనాలు, అలవెన్సులను గౌరవప్రదంగా ఉండేలా పెంచాలని సూచించారు. ఫోరంలలో వాస్తవంగా ఎదురౌతున్న ఇక్కట్లు, సమస్యల గురించి సభ్యులు సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా తెలియచేస్తే, పరిష్కారం లభిస్తుందన్నారు.
వినియోగదారుల ఫోరంలకు సంబంధించి ప్రత్యేక మంత్రిత్వ శాఖలను కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కర్నాటక రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల మంత్రి యు.టి. ఖాదర్ పేర్కొన్నారు. వినియోగదారుల రక్షణకు సంబంధించి ప్రజల్లో పూర్తి అవగాహన ఇంకారాలేదన్నారు. విదేశాల్లో వినియోగదారుల ఫోరంలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని గుర్తు చేశారు.
జాతీయ వినియోగదారుల చట్టం 1986 లో ఏర్పడ్డ తర్వాత సమాజంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని రాష్ట్ర పౌరసరఫరాల కమిషన్ సి.వి. ఆనంద్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా జాతీయ వినియోగదారుల చట్టంలో మార్పులు, చేర్పులు చేయాల్సి ఉందన్నారు. వినియోగదారుల హక్కులపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. వినియోగదారుల ఫోరంలో కేసులు త్వరగా పరిష్కారం కోసం రాష్ట్ర, జిల్లాస్థాయిలలోని ఫోరంలలో ఖాళీలు ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని సూచించారు.

చిత్రం..శనివారం హైదరాబాద్‌లో వినియోగదారుల ఫోరం సమావేశంలో ప్రసంగిస్తున్న జస్టిస్ పశాయత్