రాష్ట్రీయం

పైరుపచ్చని ఆంధ్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 17: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి జీవనంలో భాగం కావాలని సిఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండలి సంయుక్తంగా విశాఖలో రెండు రోజుల పాటు నిర్వహించిన ప్రాంతీయ సదస్సు ముగింపు సమావేశం ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా చంద్రబాబు మాట్లాడుతూ పర్యావరణం అంటే ఏదో సాంకేతిక అంశమని చాలామంది పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రకృతి ప్రసాదించిన వనరులను సద్వినియోగం చేసుకునేలా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఏరువాక, జలసిరికి హారతి, వనం- మనం కార్యక్రమాలకు రూపకల్పన చేశామన్నారు. మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే, రాష్ట్రం, తద్వారా దేశం బాగుపడుందన్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని చంద్రబాబు సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం తమ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామన్నారు. ధర్మల్, హైడల్ విద్యుత్ స్థానే సోలార్ విద్యుత్‌ను పెద్ద ఎత్తున వాడకంలోకి తెస్తున్నామని తెలిపారు. 2020నాటికి 30 శాతం, 2029 నాటికి 50 నుంచి 60 శాతం సోలార్ విద్యుత్‌ను వినియోగంలోకి తీసుకురానున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 23 శాతం గ్రీన్ కవర్ ఉందని, 2029 నాటికి దీన్ని 50 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. వాతావరణ పరిరక్షణలో భాగంగా వ్యవసాయంలో రసాయనాలు, ఎరువుల వాడకాన్ని చాలావరకూ తగ్గించామని చంద్రబాబు వివరించారు. సేంద్రీయ ఎరువుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. గ్రామాల్లో ఘన వ్యర్థాలు రోజు రోజుకూ పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని డంపింగ్ యార్డులకు తరలించడం వలన మరికొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని, ఇవి వాతావరణాన్ని పూర్తిగా కలుషితం చేస్తున్నాయని చెప్పారు. పట్టణాల్లోని ఘన వ్యర్థాలను విద్యుదుత్పత్తికి వినియోగిస్తామని, గ్రామాల్లో కంపోస్ట్‌గా మార్చనున్నామన్నారు. వచ్చే రెండు, మూడేళ్లలో రాష్ట్రంలో ఘన వ్యర్థాలు బయట ఎక్కడా కనిపించవని హామీ ఇచ్చారు. అలాగే సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను కూడా ఎక్కడకక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పరు. ప్రధాని మోదీ పిలుపుమేరకు రాష్ట్రంలో స్వచ్ఛ భారత్‌ను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 100 మున్సిపాలిటీలను మల విసర్జన రహిత మున్సిపాలిటీలుగా ప్రకటించామన్నారు. అలాగే నాలుగు వేల గ్రామాలను మల విసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించామని, 2018 నాటికి 100 శాతం గ్రామాలు మల విసర్జన రహిత గ్రామాలుగా మారనున్నాయని చంద్రబాబు చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో గ్రీన్ ట్రిబ్యునల్ విశేషమైన పాత్ర పోషిస్తోందన్నారు. నిర్ణీత కాలవ్యవధిలోనే 82 కేసులను పరిష్కరించడం ముదావహమని చంద్రబాబు అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అయ్యన్నపాత్రుడు, సిద్దా రాఘవరావు, గంటా శ్రీనివాసరావు, ఎంపి హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..పర్యావరణ పరిరక్షణ సదస్సులో మాట్లాడుతున్న సిఎం చంద్రబాబునాయుడు