రాష్ట్రీయం

రాష్ట్రంలో క్షీర విప్లవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: రాష్ట్రాన్ని క్షీర విప్లవం దిశగా తీసుకెళ్లడానికి పాడి రైతులకు ఒక కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. గొర్రెల, చేపల పెంపకాలకు ప్రత్యేకంగా పథకాలు ప్రవేశపెట్టినట్టుగానే పాడి రైతుల కోసం వచ్చే నెలలో నిధులు సమకూర్చి రెండు నెలల్లో పథకాన్ని అమలు చేస్తామన్నారు. ప్రగతి భవన్‌లో ఆదివారం పాడి రైతులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ రాష్టవ్య్రాప్తంగా రెండు లక్షల మంది పాడి రైతులు ఉండగా వారికి ఇంటికో గేదెను (బర్రె) కోనేందుకు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు. అదే ఎస్సీ, ఎస్టీలకు చెందిన రైతులు అయితే వారికి 75 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు. గేదెలను నేరుగా రైతులే కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఏ గేదె కొనుగోలు చేసినా దాని ఖరీదులో సగాన్ని ప్రభు త్వం భరిస్తుందన్నారు. రాష్ట్రంలో కోటి మూడు లక్షల కుటుంబాలు ఉండగా ఒక్కో కుటుంబానికి లీటరు చొప్పున సుమారు కోటి లీటర్ల పాలు అవసరమైతే కేవలం ఏడు లక్షల లీటర్ల పాలు మాత్రమే ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్నాయన్నారు. ప్రభుత్వరంగ సంస్థ విజయ డైరీతో పాటు పాల ఉత్పత్తిదారుల సంఘాలు అన్ని కలిపితే ఉత్పత్తి చేస్తున్నది కేవలం 7 లక్షల లీటర్లేనని ముఖ్యమంత్రి వివరించారు. అవసరమైన మిగతా పాలు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, గుజరాత్ రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. ఈ పరిస్థితి పోవాలి, వచ్చే ఆరేడు నెలల్లోనే పాల ఉత్పత్తి 10 లక్షల లీటర్లకు చేరుకోవాలన్నారు. అలా పెంచుకుంటూ వెళ్లి రాష్ట్రానికి అవసరమైన మొత్తం పాలను రాష్ట్రంలో ఉత్పత్తి జరిగేందుకు క్షీర విప్లవాన్ని తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుందన్నారు. ఇంటికో గేదెను కొనుగోలు చేయడానికి సబ్సిడీ ఇవ్వడానికి ప్రభుత్వానికి కనీసం నాలుగైదు వందల కోట్లు అవసరం అవుతాయన్నారు. వచ్చే నెలలోనే ఆ మొత్తాన్ని పాల ఉత్పత్తిదారుల సంఘాలకు విడుదల చేస్తామన్నారు. పాడి రైతులను ఆదుకునేందుకు విజయ డైరీకి పాలు పోసే రైతులకు లీటరకు నాలుగు రూపాయాలు ఇస్తున్నట్టుగానే దసరా లోపుననే నల్లగొండ, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లోని పాల సహకార సంఘాలకు పాలు పోసే రైతులకు కూడా లీటర్‌కు నాలుగు రూపాయాలు చెల్లిస్తామన్నారు. అయితే ప్రతీ పాడి రైతుకు ఆరు మొక్కల చొప్పున 12 లక్షల మొక్కలను పెంచి చూపించాలని ముఖ్యమంత్రి కోరారు. గేదెల కొనుగోలుకు డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోమని పాలు నిలువ చేయడానికి, గడ్డి కోయడానికి మిషన్లను కూడా ప్రభుత్వం ఇవ్వబోతుందన్నారు. ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం, తెచ్చుకున్నది కడుక్క తాగడానికి కాదు, ప్రజలంతా బాగు పడాలి, చేతి వృత్తుల వారు రైతులు వెరిసి ప్రజలంతా బాగుపడినప్పుడే సాధించుకున్న రాష్ట్రానికి సార్దకత ఉంటుందని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

చిత్రం..ప్రగతి భవన్ ఆవరణలో పాడి రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్