రాష్ట్రీయం

నేటి నుంచే బతుకమ్మ చీరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ‘బతుకమ్మ చీర‘ల పంపిణీ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. రాష్టవ్య్రాప్తంగా రూ. 222 కోట్ల విలువ చేయనున్న కోటి నాలుగు లక్షల చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు మంత్రి కె తారకరామారావు తెలిపారు. బతుకమ్మ కానుకగా సోదరీమణులు అందరికీ చీరలు పంపిణీ చేయడం తనకు వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఉందని కెటిఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీటి కోసం మొత్తంగా ఏడున్నర కోట్ల మీటర్ల వస్త్ర వినియోగం, 500 డిజైన్లు, వందలాది రంగుల్లో కంటికి ఇంపైన చీరలను ప్రభుత్వం తయారు చేయించింది. చీరలకు డిజైన్లు, చీరల ఎంపికను ముఖ్యమంత్రి కార్యాలయంలోని మహిళా ఉన్నతాధికారులు ఎంపిక చేయడం విశేషం. తెల్ల రేషన్ కార్డు కలిగి 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికీ చీరలు ఇవ్వాలు పంపిణీ చేయనుంది. గ్రామాలు, పట్టణాలలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా పంపిణీ చేయడానికి టెక్స్‌టైల్ శాఖ డైరెక్టర్ శైలజా రామయ్యార్ ఏర్పాట్లు చేసారు. పంపిణీ చేయనున్న చీరలలో 52 లక్షల చీరలను నేతన్నల నుంచే సేకరించడం విశేషం అయితే వారికి సుమారు రూ. 70 కోట్ల విలువ చేసే ఉపాధి లభించడం మరో విశేషం. అలాగే పంపిణీ చేసే చీరలలో సగం రాష్ట్రంలోనే తయారు కాగా ఇందులో మరమగ్గాలు అత్యధికంగా ఉన్న సిరిసిల్లాలోనే 5.2 లక్షల చీరలు తయారయ్యాయి. మిగతా చీరలను మహారాష్టల్రోని సూరత్ నుంచి తెప్పించింది. వీటిని కొనుగోలు, నాణ్యతను పరిశీలించడానికి టెక్స్‌టైల్‌శాఖ డైరెక్టర్ శైలజా రమయ్యార్ స్వయంగా అక్కడికి వెళ్లి వచ్చారు.