రాష్ట్రీయం

ద్వితీయ శ్రేణి నగరాలకూ ఐటి విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: ఐటి పరిశ్రను ద్వితీయశ్రేణి నగరాలకు తీసుకువెళ్లాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించినట్లు ఐటి శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లా కేంద్రాల్లో ఐటి టవర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపిన ప్రభుత్వం ఆదివారం నిజామాబాద్ పట్టణంలో కూడా ఐటి టవర్‌ను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఈ ఐటి హబ్ కోసం మొదటి దశలో సుమారు రూ.25 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. ఐటి హబ్‌లో ఇంకుబేషన్ సెంటర్ కూడా ఉంటుందన్నారు. వచ్చే ఏడాదిలో ఇందుకు సంబంధించి అన్ని వౌలిక వసతులను టిఎస్‌ఐఐసి ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఆదివారం బేగంపట క్యాంపు కార్యాలయంలో నిజామాబాద్ జిల్లా ఎంపి కవిత, నిజాబాద్ పట్టణ ఎమ్మెల్యే గణేష్ గుప్తా కలిసి ఐటి హబ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వ్చిన 60కు పైగా లెటర్ ఆఫ్ ఇంటెంట్‌లను మంత్రికి అంద చేశారు. ఈసందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరానికి 150 కి.మీ దూరంలో ఉన్న పట్టణానికి జాతీయ రహదారి, రైలు రవాణాసదుపాయాలు ఉన్నాయన్నారు. జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు, పక్కనే ఉన్న బాసర ట్రిపుల్ ఐటి ద్వారా వేలాది మంది ఇంజనీర్లు ప్రతి సంవత్సరం పట్టా పుచ్చుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటి పరిశ్రమలను తరలించే క్రమంలో మొదట చిన్న స్ధాయి కంపెనీలను పెట్టుబడులు పెట్టనున్నాయని తెలిపారు. వందలాది మంది ఎన్నారైలు విదేశాల్లో అనేక ఐటి కంపెనీలు పెట్టారని, వీరిలో కంపెనీలు ఏర్పాటుకు ముందుకు వచ్చిన వారికి ప్రభుత్వం తరఫున పాలసీ పరమైన రాయితీలు కల్పించనున్నట్లు చెప్పారు. ఎంపి కవిత మాట్లాడుతూ నిజామాబాద్ పట్టణ కేంద్రంలో ఐటి హబ్‌ల ఏర్పాటు ద్వారా చుట్టుపక్కల జిల్లాల్లో యువతకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. పట్టణ ఎమ్మెల్యే గణేష్ గుప్తా మాట్లాడుతూ మంత్రి కెటిఆర్ ఆదేశాల మేరకు వారం రోజుల పాటు అమెరికాలోని అట్లాంటా, న్యూజెర్సీ, వాషింగ్టన్ డిసి, చికాగో నగరాల్లో పర్యటించి ఐటి హబ్‌లో పెట్టుబడులు పెట్టాలని తెలుగు ఎన్నారైలను కోరామన్నారు.