రాష్ట్రీయం

విశాఖకు సినీ పరిశ్రమను తీసుకువస్తా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(కల్చరల్), సెప్టెంబర్ 17: విశాఖ నగరానికి సినీ పరిశ్రమను తీసుకువస్తానని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి స్పష్టంచేశారు. సుబ్బరామిరెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా ఆదివారం నగరంలోని పోర్టు కళావాణి ఆడిటోరియంలో టి.సుబ్బరామిరెడ్డి లలి తా కళాపరిషత్ ఆధ్వర్యంలో సినీ కథా నాయక, మాజీ ఎంపీ జమున సినీ జీవిత వజ్రోత్సవాన్ని పురస్కరించుకుని ఆమెకు నవరస కళావాణి బిరుదుతో టీఎస్సార్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను నెల్లూరులో జన్మించినా, హైదరాబాద్‌లో ఉంటున్నా తనకు తొలి నుంచి విశాఖవాసులంటే మక్కువు ఎక్కువని, అందువలనే ఇక్కడి ప్రజల మధ్య తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు తెలిపారు. విశాఖలో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి రూ.400 కోట్లు, కెజిహెచ్‌లో సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రికి రూ.75 కోట్లు, కెజిహెచ్ రోగుల సహాయకుల కోసం నిర్మించిన సత్రానికి నాలుగు కోట్లు, పర్యావరణ పరిరక్షణలో భాగం గా నగరంలో 50 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించినట్టు సుబ్బరామిరెడ్డి చెప్పారు. గ్రామాల్లో విద్యుత్‌ను ఇచ్చేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. నటీమణులు కాంచన, శారద, గీతాంజలి, రాజశ్రీ, ప్రభ, వాణిశ్రీ, బి.సరోజాదేవి, జయసుధ, జయప్రద, జయచిత్ర, గాయనీమణులు పి.సుశీల, కె.జమునారాణి ఆమెకు వీణను బహూకరించారు. సన్మానపత్రం, జ్ఞాపిక, దుశ్శాలవలతో ఆమెను సత్కరించారు. అలా గే రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు జము న చేతికి స్వర్ణకంకణాన్ని తొడిగారు. శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, జమాయి ఇస్లామియా అశ్రాఫుల్ ఉలూమ్ అరబిక్ ఎడ్యుకేషనల్ పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు షేక్ ముటీర్ రెహమాన్ తదితర మత గురువులు పాల్గొన్నారు.

చిత్రం..జమునకు వీణను బహూకరిస్తున్న టిఎస్సార్, పాత తరం నటీమణులు